రాజధాని ప్రకటన కోడ్ ఉల్లంఘనే

6 Sep, 2014 02:11 IST|Sakshi
  • నరహరశెట్టి నరసింహారావు
  • నందిగామ : జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటి కీ నిబంధనలకు విరుద్ధంగా విజయవాడను రాజధానిగా ప్రకటించడం కోడ్ ఉల్లంఘన కిందకే  వస్తుందని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నరహరశెట్టి నరసింహారావు స్పష్టం చేశారు. నందిగామ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నందిగామ నియోజకవర్గంలో జరుగుతున్న అసెంబ్లీ ఉప ఎన్నికల్లో టీడీపీ ఓటమి భయంతో ఒక్కసారిగా రాజధాని విషయాన్ని తెరమీదకు తీసుకొచ్చి  ప్రకటించిందన్నారు. విజయవాడను రాజధానిగా ప్రకటించడాన్ని తాము స్వాగతిస్తున్నప్పటికీ ఎన్నికలు జరుగుతున్న సమయంలో ప్రకటించటం స్వార్థపూరిత నిర్ణయమన్నారు.

    మూడు నెలల తెలుగుదేశం పాలనలో ప్రజావ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉండ డంతో అది గుర్తించిన ప్రభుత్వం ప్రజలను పక్కదోవ పట్టించేందుకు రాజధాని ప్రకటించిందన్నారు. వారు ఎన్నికుట్రలు, కుతంత్రాలు చేసినా ఈ ఉప ఎన్నికల్లో టీడీపీ ప్రజాగ్రహాన్ని చవిచూడక తప్పదని హెచ్చరించారు. పీసీసీ ఆర్గనైజింగ్ కార్యదర్శి సుధాకర్‌రావు మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో దేవినేని ఉమామహేశ్వరరావు ఎక్కడెక్కడ భారీ మొత్తంలో చందాలు వసూలు చేసి ఖర్చుపెట్టేది వివరాలు ప్రకటిస్తామన్నారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా పరిశ్రమల వారి వద్ద నుంచి మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు నిధులు సేకరిస్తున్నారని ఆరోపించారు.

    మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ మహిళలు, రైతులు, యువకులు ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నార న్నారు. ఈ నెల ఏడో తేదీన నందిగామ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో చిరంజీవి ఫ్యాన్స్ సమావేశం జరుగనున్నట్లు తెలిపారు.   వేల్పుల పరమేశ్వరరావు, నాయకులు తలమాల డేవిడ్‌రాజు, ఎస్‌కే జాఫర్, అప్పసాని సందీప్, వెలగ లేటి రామయ్య, శివాజి, ఆకుల శ్రీనివాసరావు, పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
     

మరిన్ని వార్తలు