65 లీటర్ల స్పిరిట్ పట్టివేత

15 Mar, 2016 03:59 IST|Sakshi
65 లీటర్ల స్పిరిట్ పట్టివేత

 10 బస్తాల ఖాళీ సీసాలు, లేబుళ్లు స్వాధీనం
 
ఎమ్మిగనూరు రూరల్:  గోనెగండ్ల మండలం పుట్టపాశం గ్రామంలో 65 లీటర్ల స్పిరిట్, 10 బస్తాల ఖాళీ సాలు, లెబుళ్లను సోమవారం ఎక్సైజ్, టాస్క్‌ఫోర్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టణంలో రాత్రి 10 గంటలకు ఎక్సైజ్ డీసీ ధనలక్ష్మీ విలేకరులతో మాట్లాడుతూ పుట్టపాశం గ్రామానికి చెందిన బోయ రంగన్న స్పిరిట్‌తో నకిలీ మద్యం తయారు చేసి ఎమ్మిగనూరు, కోసిగి ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు సమాచారం రావటంతో దాడి చేశామన్నారు.

ఎక్కడా అనుమానం రాకుండా సీసాలపై లేబుళ్లను అతికించి గ్రామాల్లో విక్రయిస్తున్నాడన్నారు. గంజెళ్ల ఉరుసు సందర్భంగా విక్రయించేందుకు సరుకు సిద్ధం చేసుకోగా అజ్ఞాత వ్యక్తుల సమాచారంతో అతడిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. రంగన్నపై గతంలో పీడీ యాక్ట్ కింద కేసు కూడా నమోదయిందన్నారు. ఈ కేసు విషయంలో అప్రమత్తంగా వ్యవహరించిన పత్తికొండ ఎక్సైజ్ సీఐ చంద్రశేఖర్, సిబ్బందిని ఆమె అభినందించారు. విలేకరుల సమావేశంలో ఎక్సైజ్ సూపరిటెండెంట్ హెబ్సిబారాణి, టాస్క్‌ఫోర్స్ సీఐ కృష్ణకుమార్, ఎమ్మిగనూరు సీఐ లక్ష్మీదుర్గయ్య, పత్తికొండ, ఎమ్మిగనూరు ఎస్సైలు సునీల్‌కుమార్, భాగ్యలక్ష్మీ , సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు