అదుపు తప్పి పంట కాల్వలోకి దూసుకెళ్లిన కారు

4 Nov, 2019 14:10 IST|Sakshi

ప్రకాశం జిల్లా కారంచేడు వద్ద ఘటన

సాక్షి, ప్రకాశం: జిల్లాలోని కారంచేడు వైపు నుంచి చీరాల వస్తున్న ఓ మారుతీ కారు ప్రమాదవశాత్తు అదుపు తప్పి పంట కాల్వలోకి దూసుకెళ్లింది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు  అక్కడికి చేరుకుని కారులోని వారిని  సురక్షితంగా బయటకు లాగారు. అయితే ఈ సంఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. కారులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు చిన్నపాటి గాయాలతో బయటపడ్డారు. వారందరిని దగ్గరలోని ప్రభుత్వ  ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. కారు ప్రమాదాన్నికి అతి వేగమే కారణమని తెలుస్తోంది. 
 

మరిన్ని వార్తలు