క్షణాల్లో కారు దగ్ధం...తృటిలో బయటపడ్డారు..

1 May, 2019 10:20 IST|Sakshi

సాక్షి, నిడమానూరు : కృష్ణాజిల్లా విజయవాడ రూరల్ మండలం నిడమానూరు వద్ద హైవేపై బుధవారం ఉదయం ఓ కారు దగ్ధమైంది. కారులో ప్రయాణిస్తున్నవారు ఈ ప్రమాదం నుంచి తృటిలో బయటపడ్డారు. హైదరాబాద్ నుండి పాలకొల్లు వెళుతున్న ఐ-టెన్‌ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కారును డ్రైవ్‌ చేస్తున్న మల్లాది నరసింహ శాస్త్రి మంటలను గమనించి వెంటనే వాహనాన్ని పక్కకు తీశారు. అదృష్టవశాత్తూ కారులో ఉన్నవారంతా దిగగానే మంటలు ఒక్కసారిగా చెలరేగి, క్షణాల్లో కారు దగ్ధమైంది. హైదరాబాద్‌లోని  ఓ ఫార్మా కంపెనీలో మేనేజర్‌గా పని చేస్తున్న నరసింహ శాస్త్రి పాలకొల్లులోని తమ బంధువులు ఇంటికి కుటుంబంతో కలిసి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకోవడంపై అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా