కార్బైడ్‌తో పండిస్తే కటకటాలకే..

7 Feb, 2016 18:40 IST|Sakshi

 మామిడి కాయలకు పేరొందిన ఉలవపాడులో ఈ సారి హానికర రసాయనాల ప్రభావం లేకుండా చేయడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. మరో నెలలో మామిడి సీజన్ మొదలు కానుంది. ఈ నేపథ్యంలో మామిడి కాయలను కార్బైడ్‌తో పండిస్తే రైతులైనా, వ్యాపారులైనా కటకటాలు లెక్కెట్టాల్సిందేనని అధికారులు  హెచ్చరిస్తు
 
 ఉలవపాడు :ఈ ఏడాది పండ్ల వ్యాపారులకు, రైతులకు నియమ నిబంధనలను అధికారులు కఠినతరం చేయనున్నారు. ప్రధానంగా కార్బైడ్ ద్వారానే అధికంగా పండించి వ్యాపారం చేస్తున్న రైతులు ఈ పరిస్థితిని చూసి కలవర పడుతున్నారు. దాదాపు జాతీయరహదారిపై ఎక్కువగా కలుషిత పండ్లనే అమ్ముతున్న పరిస్థితి. అంతేగాక అన్ని పండ్లను పక్వానికి రాకుండానే రసాయనాల ద్వారా పండిస్తున్నారు. సోమవారం హైకోర్టు సైతం ఈ పండ్లు తినడం వలన కాన్సర్‌తో పాటూ పలు వ్యాధులు వస్తున్నాయని, దీనికి ప్రత్యేక తనిఖీలు  చేపట్టాలని ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలను ఆదేశించింది. 
 
 ఫుడ్ ఇన్‌స్పెక్టర్ పాండురంగారావు ఏమన్నారంటే.. ప్రజల ప్రాణాలకు హానికరమైన ఈ కార్బైడ్‌ను పండ్లకు వాడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం. ఈ సారి కార్బైడ్‌ను వాడితే వ్యాపారులు జైలు కెళ్లాల్సి ఉంటోందని హెచ్చరించారు.  
 
 ఇవీ నిబంధనలు  
 రెగ్యులేషన్ 2.3.5 ప్రకారం కాల్షియం కార్బైడ్ వాడుట నిషేధం ఏవ్యక్తి ఎసిటిలీన్ గ్యాస్‌తో అనగా సాధారణ కార్బైడ్ గ్యాస్‌తో పండ్లను కృత్రిమంగా పరిపక్వత గావించడం, అమ్మకం, ఇవ్వడం, అమ్మకానికి నిల్వ ఉంచడం నిషేధంఆహార సంరక్షణ-ప్రమాణాల చట్టం ప్రకారం ఆరేళ్లు కారాగార శిక్ష, రూ.ఐదు లక్షల జరిమానా

>
మరిన్ని వార్తలు