ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణపై కేసు నమోదు

25 Sep, 2019 18:20 IST|Sakshi

ఆంధ్రజ్యోతిపై విద్యార్థి సంఘాల మండిపాటు

సాక్షి, అనంతపురం : సచివాలయ ఉద్యోగాల ప్రశ్నాపత్రాలపై అసత్య కథనాలు ప్రసారం చేస్తున్న ఎల్లో మీడియాపై విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి. శ్రీకృష్ణ దేవరాయ వర్సిటీ ఎదుట ఆంధ్రజ్యోతి పత్రికా ప్రతులను దహనం చేసి నిరసన తెలియజేశాయి. ఎస్కే వర్సిటీలో హార్టికల్చర్‌ పేపర్ రూపొందించారంటూ ఎల్లో మీడియా ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ఈ వార్తలపై ఎస్కే వర్సిటీ సిబ్బంది స్పందించింది. తమ వర్సిటీలో హార్టికల్చర్‌ విభాగం, ప్రొఫెసర్లు లేనప్పుడు పేపర్‌ ఎలా రూపొందిస్తామని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ మేరకు అసత్య కథనాలు ప్రచురించిన ఆంధ్రజ్యోతి పత్రికపై చర్యలు తీసుకోవాలని ఎస్కే వర్సిటీ సిబ్బంది డిమాండ్‌ చేస్తున్నారు. 

ఈ నేపథ్యంలో వర్సిటీకి చెందిన ఓ ప్రొఫెసర్‌ మాట్లాడుతూ..‘ ప్రశ్నాపత్రం తయారు చేయకపోయినా చేసినట్టు చూపారు. ఎస్కే వర్సిటీలో అసలు సచివాలయ ప్రశ్నా పత్రాలు రూపొందించలేదు. ఉద్యోగాల ప్రక్రియలో మాకు ఎలాంటి బాధ్యతలు అప్పగించలేదు’ అని స్పష్టం చేశారు. ఇక ఆంధ్రజ్యోతి పత్రికపై మండిపడిన విద్యార్థి సంఘాలు.. ఆ పత్రిక ప్రతులను దహనం చేశాయి. ఈ క్రమంలో ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణపై ఇటుకలపల్లి పోలీసు స్టేషనులో ఫిర్యాదు నమోదైంది.

మరిన్ని వార్తలు