భూవివాదం: మంత్రి దేవినేనిపై కేసు నమోదు

11 Jan, 2018 16:21 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  ఏపీ నీటిపారుదల మంత్రి దేవినేని ఉమతో పాటు ఆయన అనుచరులు, విజయవాడ సీపీ గౌతమ్‌ సవాంగ్‌ నుంచి తనకు ప్రాణహాని ఉందని హైదరాబాద్‌ యూసుఫ్‌గూడకు చెందిన అట్లూరి ప్రవిజ ఆరోపించారు. తనను కిడ్నాప్‌ చేసేందుకు లేదా హత్య చేసేందుకు ప్రయత్నాలు జరగొ చ్చని గురువారం బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తనకు రక్షణ కల్పిం చాలని కోరారు. దీనిపై న్యాయ నిపుణుల సలహా మేరకు చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు.

అమరావతి దగ్గర్లోని కంచికచర్ల మండలం చౌటుకల్లు గ్రామంలో తనకు రెండెకరాల స్థలం ఉందని, ఈ భూమి పంపకాల విషయంలో మంత్రి దేవినేని తమ్ముడు దేవినేని చంద్రశేఖర్, చవలం శ్రీనివాసరావు, మన్నె నాయుడు, మంత్రి పీఏ చౌదరి, మరో పీఏ శివరావు, గన్‌మన్‌ ప్రసాద్, ఆయన క్లాస్‌మేట్‌ ఎనిగళ్ల రాజేంద్రప్రసాద్, సొసైటీ ప్రెసిడెంట్‌ కోగంటి విష్ణువర్ధన్‌రావు వేధిస్తున్నారని బాధితురాలు వాపోయారు. ‘వీరిపై గతేడాది జూన్‌ 21న విజయవాడ సీపీ సవాంగ్‌కు ఫిర్యాదు చేశాను. మంత్రి దేవినేనితో పాటు ఆయన సోదరుడిపై విజయవాడ సూర్యారావుపేట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది.

ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతిం టుందని, కేసును వెనక్కి తీసుకోవాలంటూ నాపై మంత్రి కార్యాలయంతో పాటు పోలీసు లు ఒత్తిడి చేస్తున్నారు. పోలీసుల వ్యవహార శైలిపై గతేడాది సెప్టెంబర్‌ 19న మానవ హక్కుల కమిషన్‌ (హెచ్‌ఆర్సీ)లో ఫిర్యాదు చేశాను. ఏపీ డీజీపీకి హెచ్‌ఆర్సీ నోటీసులు కూడా జారీ చేసింది. గత గురువారం కొందరు పోలీసులు విజయవాడలోని మా ఇంటికెళ్లి నా కదలికలపై ఆరా తీశారు. 2015 నవంబర్‌లో అప్పటి పట మట సీఐ దామోదర్‌ నన్ను కిడ్నాప్‌ చేసి గొల్లపూడిలోని మంత్రి ఇంటికి తీసుకెళ్లారు’అని ఫిర్యాదులో పేర్కొన్నారు. 

 

మరిన్ని వార్తలు