అయ్యన్నపాత్రుడుపై కేసు నమోదు

16 Jun, 2020 19:05 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: మాజీ మంత్రి, టీడీపీ నేత చింతకాయల అయ్యన‍్న పాత్రుడుపై కేసు నమోదయ్యింది. నర్సీపట్నం మున్సిపల్‌ కార్యాలయంలో ఆయన తాత లచ్చాపాత్రుడు ఫోటోని మరో గదిలో తాత్కాలికంగా మార్చిన దశలో తన పట్ల అయ్యన్న అనుచితంగా మాట్లాడారంటూ మున్సిపల్‌ కమిషనర్‌ కృష్ణవేణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. లచ్చాపాత్రుడు ఫోటోను మున్సిపల్‌ సిబ్బంది మార్చడంతో గత రెండు రోజుల క్రితం మున్సిపల్‌ కార్యాలయం ఎదుట నిరసన తెలపడంతో పాటు మున్సిపల్‌  సిబ్బందిని అయ్యన్న దుర్భాషలాడిన సంగతి తెలిసిందే.

 

మరిన్ని వార్తలు