వీడిన హత్య కేసు మిస్టరీ

20 May, 2019 09:34 IST|Sakshi

చింతూరు (రంపచోడవరం): ఈనెల 13న అనుమానాస్పద స్థితిలో లభ్యమైన బొడ్డుగూడేనికి చెందిన తాటి కన్నయ్య (60) హత్య కేసులో మిస్టరీ వీడింది. మంత్రగాడనే అనుమానంతో కన్నయ్యను అదే గ్రామానికి చెందిన తండ్రి కొడుకులు హతమార్చినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ కేసు వివరాలను చింతూరు సీఐ వెంక టేశ్వరరావు ఆదివారం వెల్లడించారు. బొడ్డుగూడెం సమీపంలోని పులివాగులో గుర్తు తెలి యని మృతదేహం ఉందన్న సమాచారం పోలీసులకు అందింది. మృతుడు కన్నయ్యగా గుర్తించామని, అతను కొన్ని రోజులుగా గ్రామంలో కనబడడం లేదని తేలిందని తెలిపారు.

దీనిపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామన్నారు. మృతుడు గ్రామంలోని సొంది భద్రయ్య అనే వ్యక్తి ఇంటి వద్ద అధికంగా ఉండేవాడని, మే 16న భద్రయ్య భార్య గంగమ్మ అనారోగ్యంతో మృతి చెందితే కన్నయ్య మంత్రాల (చేతబడి) వల్లే భార్య మృతి చెందిందని భద్రయ్య.. కొడుకు నాగరాజు భావించారు. ఈ నెల 6న అతడిని వారు ఇంటికి పిలిచి అతని గొంతుకు చొక్కా బిగించి హత మార్చి మృతదేహాన్ని జెడ్డీపై మోసుకెళ్లి సమీపంలోని వాగులో పూడ్చి పెట్టారని విచారణలో తేలిందన్నారు. నిందితులను ఆదివారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. కేసు దర్యాప్తులో కీలకంగా వ్యవహరించిన ఎస్సై శ్రీనివాస్‌కుమార్‌ను ఎస్పీ అభినందించారని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో ఎస్సైలు సురేష్‌బాబు, మహాలక్ష్మణుడు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు