దర్శిలో ఓటుకు నోటు!

10 Mar, 2017 11:07 IST|Sakshi
దర్శిలో ఓటుకు నోటు!

దర్శి: ఓటుకు నోటు టీడీపీ రూట్‌లా మారింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విద్యావంతులను సంతలో పశువులను కొన్నట్లు కొనేందుకు నానాతంటాలు పడ్డారు. పట్టభద్రులతో బేరాలాడి మరీ ఓట్లు వేయించుకునేందుకు నాయకులు విశ్వప్రయత్నాలు చేశారు. గురువారం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో దర్శి మండలంలో ఓట్లు కొనుగోలుకు అధికార పార్టీ నాయకులు కొత్త పద్ధతి ప్రవేశ పెట్టారు.

మధ్యాహ్నం వరకు ఓటింగ్‌ సరిళి తెలుసుకున్న ముఖ్య నేతలకు తమ పార్టీ అభ్యర్థులు ఓడిపోతారన్న సందేహం వ్యక్తమైంది. డబ్బులిస్తేనే ఓట్లు వేసేందుకు వస్తామని పట్టభద్రులు డిమాండ్‌ చేస్తున్నారని ముఖ్య నేతలకు స్థానిక నేతల ద్వారా సమాచారం అందింది. ఆయన హుటాహుటిన దర్శి వచ్చారు. నేరుగా టీడీపీ అభ్యర్థుల తరఫున స్లిప్పులు రాసే టెంట్‌ వద్దకు వెళ్లి పరిస్థితి తెలుసుకున్నారు. ఎంత డబ్బు ఖర్చయినా ఓటర్లను రప్పించి ఓట్లేయించండని ఆదేశాలు జారీ చేశారు. స్థానిక ఆ పార్టీ నాయకులు పట్టభద్రులను బేరాలాడి మరీ పిలిపించి డబ్బులు పంచి ఓట్లేయించుకున్నారు.

డబ్బు పంచింది ఇలా..: ఓటర్లకు టీడీపీ నాయకులు స్లిప్పులు పంచారు. వాటిపై ప్రదీప్‌ మెడికల్స్‌.. అనే స్టాంపు వేసి ఉంది. పట్టభద్రులతో బేరమాడి వారి అడిగినంత ఆ స్లిప్పుపై వేసి పంచారు. ముఖ్యనేత అనుచరుడి ఆస్పత్రిలోని మెడికల్‌ షాపులోకి వెళ్లి ఆ స్లిప్పు ఇచ్చి అందులో రాసినంత డబ్బు తీసుకుని వెళ్లి ఓటు వేసి వచ్చారు.

మరిన్ని వార్తలు