18 Aug, 2018 13:05 IST|Sakshi

సాక్షి, గుంటూరు:టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్‌రావు గురజాలలో చేసిన అక్రమ మైనింగ్‌ వ్యవహారంలో సీబీసీఐడీ విచారణ ప్రారంభించింది. టీడీపీకి చెందిన ఎమ్మెల్యే కనుసన్నల్లో జరుగుతున్న ఈ దందాపై ఎట్టకేలకు విచారణను ప్రారంభించారు. దీనిలో భాగంగా సీబీఐ, మైనింగ్‌ అధికారులు పిడుగురాళ్ల పీఎస్‌కు చేరుకున్నారు.18 ఏళ్ల మైనింగ్‌ లావాదేవీలపై సీబీఐ విచారణ జరుపుతోంది. సున్నం తయారీ​ మిల్లర్లతోనూ సమావేశం ఏర్పాటుచేశారు. అంతకుముందు అక్రమ మైనింగ్‌ జరిగిన పిడుగురాళ్ల, దాచేపల్లి మండలాల్లో గతంలో పనిచేసిన, ప్రస్తుతం పనిచేస్తోన్న అధికారులకు ప్రభుత్వం షోకాజ్‌ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.

యరపతినేనికి క్లీన్ చిట్ ఇవ్వటానికే...
గురజాల అక్రమ మైనింగ్‌ కేసులో టీడీపీ ఎమ్మెల్యే యరపతి శ్రీనివాస రావుకు క్లీన​చీట్‌ ఇవ్వటానికే సీఐడీ విచారణను జరుపుతున్నారని వైఎస్సార్‌ సీపీ సమన్వయ కర్త కాసు మహేష్‌ రెడ్డి ఆరోపించారు. సీబిఐతో జరపాల్సిన విచారణను సీఐడీతో జరిపించాల్సిన అవసరమేంటని నిలదీశారు. టీడీపీకి సీఐడీ తోక సంస్థ అని, ఏ ఎమ్మెల్యే నైనా విచారించిన ఘనత సీఐడికి ఉందా అని ప్రశ్నించారు. ఐదు వందల కోట్లు దోచిన స్కాంను సీబిఐతో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. డెబ్బై వేలు విలువ చేసే భూములను అప్పట్లోనే రెండు మూడు లక్షల చొప్పున కొన్నారని, ఈ భూములపై యరపతినేని చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని మహేష్‌ రెడ్డి స్పష్టం చేశారు. 

చదవండి: అక్రమం చేసిందొకరు.. బలయ్యేది ఎందరో..?

మరిన్ని వార్తలు