టీడీపీ ఎమ్మెల్సీ ఇంటిపై సీబీఐ దాడులు

13 May, 2017 01:11 IST|Sakshi
టీడీపీ ఎమ్మెల్సీ ఇంటిపై సీబీఐ దాడులు

శుక్రవారం తెల్లవారుజాము నుంచి రాత్రి 9 గంటలదాకా కొనసాగిన సోదాలు..

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి నివాసంపై సీబీఐ అధికారుల బృందం దాడులు జరిపింది. శుక్రవారం తెల్లవారు జామున నెల్లూరు వేదాయపాలెంలోని వాకాటి ఇంటికి చేరుకున్న ఈ బృందం అప్పటినుంచి రాత్రి 9 గంటల వరకు సోదాలు నిర్వహించింది. బ్యాంకులను మోసం చేసిన కేసుకు సంబం ధించి సీబీఐ ఈ దాడులు జరిపింది. ఈ సందర్భంగా పలు పత్రాలను స్వాధీనం చేసు కుంది. 99 అగ్రిమెంట్‌ దస్తావేజులు ఇందులో ఉన్నట్టు సమాచారం. సోదాల నేపథ్యంలో సీబీఐ అధికారుల బృందం వాకాటిని ప్రశ్నిం చింది.మరోవైపు వాకాటికి చెందిన హైదరాబాద్‌లోని వీఎన్‌ఆర్‌ ఇన్‌ఫ్రా కార్యాలయంలోనూ సీబీఐ అధికారుల బృందం సోదాలు జరిపింది. నెల్లూరులోని వాకాటి నివాసంలో రాత్రి 9 గంటలకు సోదాలు ముగిశాయి. ఈ దాడులపై వివరణ కోరేందుకు మీడియా ప్రయత్నించగా.. వివరాలు చెప్పేందుకు సీబీఐ అధికారులు నిరాకరించారు.

వ్యాపారాల్లో సహజమే..:వాకాటి
సీబీఐ దాడుల అనంతరం వాకాటి విలేకరుల తో మాట్లాడుతూ.. వ్యాపార లావాదేవీలు, బ్యాంకు అగ్రిమెంట్లకు సంబంధించిన విచార ణ నిమిత్తం సీబీఐ అధికారులు వచ్చారని తెలిపారు. అనేక అంశాలపై తన నుంచి వివరణ తీసుకున్నారని చెప్పారు.  వ్యాపారాల్లో ఇదంతా సహజమేనని, దానిపై రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదని ఆయన ముక్తాయించారు.

పూర్వాపరాలివీ..: వీఎన్‌ఆర్‌ ఇన్‌ఫ్రా, పవర్‌టెక్‌ లాజిస్టిక్స్‌ సంస్థల పేరుతో నారా యణరెడ్డి నిర్మాణ రంగం, ఇతర వ్యాపారాలు చేస్తున్నారు. 2014లో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండి యా, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, ఇండియన్‌ ఓవర్సీ న్‌ బ్యాంకుల నుంచి ఆయన రూ.443.27 కోట్ల మేర రుణాలు తీసుకు న్నారు. బకాయి పడిన మొత్తం వడ్డీతో సహా చెల్లించకపోతే ఆస్తులు జప్తు చేస్తామని ఇటీవల బ్యాంకులు నోటీసులు ఇచ్చాయి.దీంతో వాకాటిపైన చీటింగ్‌తో పాటు పలు కేసులు నమోదయ్యా యి.  మరో వైపు నకిలీ డాక్యుమెంట్లతో వాకాటి తమ నుంచి రూ.190 కోట్ల రుణం తీసుకు న్నారని ఇండస్ట్రియల్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీబీఐ కేసు నమోదు చేసింది.

మరిన్ని వార్తలు