ఏ రాష్ట్రంలోనైనా సీబీఐ దర్యాప్తు చేయవచ్చు

17 Nov, 2018 03:48 IST|Sakshi

ఎవరైనా తప్పు చేస్తే.. ఆ తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటారుగానీ ఆ వ్యవస్థను రద్దు చేయరు. సీబీఐ దర్యాప్తును రాష్ట్ర సర్కారు అడ్డుకోలేదు. రాష్ట్రానికి చెందిన అంశాలపై సదరు రాష్ట్ర సర్కారు కోరితేనే కేంద్రం సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తుంది.. ఇందులో కొత్తదనం ఏమీ లేదు. రాష్ట్రంలో కేంద్ర నిధులతో కొనసాగుతున్న ప్రాజెక్టులు, పథకాల్లో అక్రమాలు, అవినీతి జరిగితే సీబీఐ దర్యాప్తు నేరుగా చేపడుతుంది, ఇందుకు రాష్ట్ర ప్రభుత్వ అనుమతి అవసరం లేదు.

ఢిల్లీలోనే కేసు నమోదు చేసి ఏ రాష్ట్రానికైనా వెళ్లి దర్యాప్తు చేసే అధికారం సీబీఐకి ఉంది. కేంద్ర అధికారులపై దర్యాప్తు చేసే అధికారం సీబీఐకి లేకపోతే ఏసీబీకి ఎలా వస్తుంది? అలాగే న్యాయస్థానాలు సీబీఐ దర్యాప్తును ఆదేశిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఏమీ చేయలేదు. ఇదంతా సంచలనం కోసం చేసినట్లుంది తప్ప.. దీనివల్ల సీబీఐ దర్యాప్తును నిలువరించడం సాధ్యం కాదు. ఓ ముసలమ్మ కోడిని తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకుని ఇక తెల్లారదులే అనుకున్నట్టుగా ఉంది ఈ వ్యవహారం.
    – ఐవైఆర్‌ కృష్ణారావు, రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి 

మరిన్ని వార్తలు