అయేషా హత్య కేసు : దూకుడు పెంచిన సీబీఐ

18 Jan, 2019 11:37 IST|Sakshi

సాక్షి, విజయవాడ : సంచలనం సృష్టించిన నర్సింగ్‌ విద్యార్థిని అయేషా మీరా(19) హత్య కేసు విచారణలో సీబీఐ దూకుడు పెంచింది. శుక్రవారం ఉదయం నుండి సత్యంబాబును సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. సత్యం బాబు కుటుంబ సభ్యుల స్టేట్ మెంట్‌ను సీబీఐ అధికారులు రికార్డ్ చేసుకుంటున్నారు. విజయవాడలోని నందిగామ సమీపంలోని అనగమసాగరం గ్రామంలో సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. 'ఈ కేసుతో నాకు ఎటువంటి సంబంధం లేదు. ఆయేషా మీరా కేసులో పోలీసులు నన్ను చిత్రహింసలు పెట్టారు. నేరం అంగీకరించక పోతే ఎన్‌కౌంటర్ చేస్తానని బెదిరించారు. నేను బతికేందుకు కనీస ఉపాధి కూడా లేదు' అని సీబీఐ అధికారులతో సత్యం బాబు తెలిపారు. ఇబ్రహీంపట్నం శ్రీ దుర్గా హాస్టల్ నిర్వాహకులను సైతం సీబీఐ అధికారులు విచారించనున్నారు. 

ఈ కేసులో ఇప్పటికే విజయవాడ కోర్టుకు చెందిన ముగ్గురు కోర్టు సిబ్బందిపై సీబీఐ అధికారులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. కేసు డాక్యుమెంట్లు, సాక్ష్యాలు ధ్వంసం అయిన అంశంపై పి.కుమారి, పి. వెంకటకుమార్‌, వై సుబ్బారెడ్డిలపై కేసు​ నమోదు చేశారు. అయేషా మీరా కేసులో అసలు నిందితులను పట్టుకోవటంలో ఏపీ పోలీసులు విఫలమవ్వటంతో హైకోర్టు ఈ కేసును సీబీఐకి బదిలీ చేసిన సంగతి తెలిసిందే.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఊరంతా డబుల్‌ పోజే..

కొట్టి చంపి..కట్టుకథలు!

పోలీసుల హైడ్రామా.. వైఎస్సార్‌ సీపీపై కుట్ర

మద్యం ఉచ్చు.. యువత చిత్తు

గ'మ్మత్తు' వైద్యం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మహేష్‌.. శభాష్‌! 

సరికొత్త సిరివెన్నెల 

నయా సినిమా.. నయా లుక్‌

డబుల్‌ ధమాకా!

మరో సౌత్‌ రీమేక్‌

నిర్మాత రాజ్‌కుమార్‌ బర్జాత్య మృతి