సీబీఐ వలలో ఐటీ డిప్యూటీ కమిషనర్

8 Jul, 2014 01:17 IST|Sakshi

తిరుపతి: భారీ మొత్తంలో లంచం తీసుకుంటుండగా తిరుపతి ఇన్‌కంట్యాక్స్ డిప్యూటీ కమిషనర్  ఫజుల్లాను సోమవారం సీబీఐ అధికారులకు పట్టుకున్నారు. వైఎస్‌ఆర్ జిల్లాకు చెందిన ఒక కంపెనీ చార్టెడ్ అకౌంటెంట్ నుంచి ఆదాయపన్ను ట్యాక్స్‌లు తగ్గించేందుకు డిప్యూటీ కమిషనర్ ఫజుల్లా రూ. 5 లక్షల డిమాండ్ చేశారు.  చివరకు రూ. 3 లక్షలు ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారు.  చార్టెడ్ ఆకౌంటెంట్ శనివారం చెన్నైలోని సీబీఐ అధికారులను ఆశ్రయించారు.

వారి సూచన మేరకు సోమవారం తిరుపతిలోని ఇన్‌కంట్యాక్స్ కార్యాలయంలోని తన చాంబర్‌లో ఉన్న డిప్యూటీ కమిషనర్ ఫజుల్లాను చార్టెడ్ అకౌంటెంట్ కలిసి రూ. 3 లక్షలు అందజేశాడు. అప్పటికే కార్యాలయంలో మాటు వేసిన చెన్నైకి చెందిన 14 మంది సీబీఐ బృందం తనిఖీలు చేసి రూ. 3 లక్షల అనధికార డబ్బును, ఫైళ్లను, మరికొన్ని డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.  ఫజుల్లాతోపాటు మరో ఇద్దరు ఇన్‌కంట్యాక్స్ అధికారులను అదుపులోకి తీసుకున్నారు.
 
 

>
మరిన్ని వార్తలు