మరో కన్ను చూస్తోంది..

4 Mar, 2019 07:48 IST|Sakshi
సర్కిల్‌ కార్యాలయంలో సీసీ టీవీ పుటేజీలను పరిశీలిస్తున్న సీఐ ఇలియాజ్‌ మహ్మద్‌

ప్రధాన జంక్షన్‌లలో సీసీ కెమెరాలు

నేరస్తులను పట్టుకోవడంలో సహాయకారిగా మారుతున్న వైనం

సర్కిల్‌ కార్యాలయం నుంచి పర్యవేక్షణ

విజయనగరం, సాలూరు: నేరస్తుల గుట్టురట్టు చేయడంలో సీసీ కెమెరాలు కీలకపాత్ర వహిస్తాయన్న విషయం అందరికీ తెలిసిందే. ఇవి ఒకప్పుడు ధనికులు జీవించే ప్రాంతాలు, గృహాల్లో మాత్రమే పరిమితంగా కనిపించేవి. అయితే ఇటీవల కాలంల నేరాలు ఎక్కువ కావడంతో నేడు చిన్న చిన్న పట్టణాల్లో సైతం వీటిని ఏర్పాటు చేస్తున్నారు. ఇక విషయంలోకి వస్తే సాలూరు మున్సిపాలిటీలో దాదాపు మూడేళ్ల కిందటే నేరాల అదుపునకు పట్టణ పోలీసులు సీసీ కెమెరాలను పలుచోట్ల ఏర్పాటు చేశారు.

మొదట తహసీల్దార్‌ కార్యాలయం జంక్షన్‌లో 3 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. దీనివల్ల 26వ నంబరు జాతీయ రహదారిపై ఆంధ్ర– ఒడిశా రాష్ట్రాల మధ్య రాకపోకలు సాగించే వాహనాలపైనే కాకుండా పట్టణంలో తిరిగే వాహనాలు, పాదచారులపై కూడా నిఘా పెట్టారు. పట్టణంలో నిలిపివేసిన లారీని కొంతమంది దొంగిలించి ఛత్తీస్‌గఢ్‌కు తరలించిన కేసును సీసీ కెమెరాల సహాయంతోనే పోలీసులు అతి తక్కువ కాలంలోనే ఛేదించారు. దీంతో పోలీసులు మరో అడుగు ముందుకేసి మరిన్ని సీసీ కెమెరాలు పట్టణంలో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం డీలక్స్‌ సెంటర్, వేంకటేశ్వరకాలనీ, తదితర ప్రాంతాలలో కూడా ఏర్పాటు చేశారు. పోలీసుల సహకారంతోనే మొత్తం ఎనిమిది సీసీ కెమెరాలు ఏర్పాటయ్యాయి. వీటిన్నింటినీ సర్కిల్‌ కార్యాలయానికి అనుసంధానం చేయడంతో అక్కడ నుంచే పోలీసులు ఆయా ప్రాంతాలను కంప్యూటర్‌ ద్వారా పరిశీలిస్తున్నారు. ఇటీవల సెల్‌ షాపులో జరిగిన చోరీ కేసులో కూడా సీసీ పుటేజీలు కీలకంగా మారాయి.

మరో 68 సీసీ కెమేరాలు..
ప్రభుత్వం జాతీయ రహదారిపైనే కాకుండా ఇతర ప్రధాన రహదారులపై కూడా ప్రత్యేకంగా 68 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసింది. మేక్స్‌వెల్‌ సంస్థ సహకారంతో ఇక్కడ రికార్డయిన దృశ్యాలను నేరుగా అమరావతిలో మానటరింగ్‌ చేసేలా ఏర్పాట్లు చేశారు. వీటిసాయంతో రోడ్డు ప్రమాదాలకు బాధ్యులైన వారితో పాటు అక్రమ రవాణాలను కట్టడి చేయగలుగుతున్నారు.

దర్యాప్తు వేగవంతం..
సీసీ కెమెరాల సహాయంతో చోరులు, ప్రమాదాలు చేసిన వారిని తొందరగా గుర్తించే వీలుంటుంది. సీసీ పుటేజీ కారణంగా దర్యాప్తు వేగవంతం అవుతుంది. ముఖ్యంగా చైన్‌ స్నాచింగ్‌లు, దోడీలకు పాల్పడేవారు సులువుగా దొరికిపోయే అవకాశం ఉంది. – ఇలియాజ్‌ మహమ్మద్, సీఐ, సాలూరు

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఈనాటి ముఖ్యాంశాలు

గ్రహణం రోజున ఆ ఆలయం తెరిచే ఉంటుంది

ఆటోను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

ఏపీలో 38 మంది డీఎస్పీలు బదిలీ

ఏపీకి కొత్త గవర్నర్‌

చిరునవ్వుతో స్వాగతించాలి : సీఎం జగన్‌

‘విభజన హామీలు నెరవేర్చుతాం’

పరిశీలనలో వెనుకబడిన జిల్లాల నిధులు

‘కాపులను అన్ని విధాల ఆదుకుంటాం’

కాంచీపురంలో టీటీడీ చైర్మన్‌ దంపతులు

వారికి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నాం: వైఎస్‌ జగన్‌

‘కాపులను దశలవారీగా మోసం చేశారు’

80 శాతం గ్రీవెన్సెస్‌ వాటికి సంబంధించినవే : సీఎం జగన్‌

దానికి కట్టుబడివున్నాం: పురందేశ్వరి

టీడీపీ నేతలకు అంబటి చురకలు..!

చంద్రబాబుపై ఎమ్మెల్యే రోజా ఫైర్‌

ధర్నాలతో దద్దరిల్లిన కలెక్టరేట్‌ 

పున:పరిశీలనంటే బాబు ఎందుకు వణికిపోతున్నారు?

బైకులు ఢీ; బస్సు కిందపడి ఇద్దరమ్మాయిల దుర్మరణం

అరకులోయలో మహిళా డిగ్రీ కళాశాల

నిధులు చాలక..నత్తనడక

ఎల్‌1, ఎల్‌2, ఎల్‌3 దర్శనాలు రద్దు

7 నుంచి చెన్నై సంత్రాగచ్చి వీక్లీ స్పెషల్‌

సదావర్తి భూముల్లో అక్రమాలపై విచారణ జరిపిస్తాం

దివిసీమలో గాలివాన బీభత్సం

ధర్నాలతో దద్దరిల్లిన కాకినాడ కలెక్టరేట్‌

ఈ బండి.. తోస్తే గానీ కదలదండీ !

పెన్సిల్‌ ముల్లుపై షిర్డీసాయిబాబా 

గురుభ్యోనమః

ఉపాధ్యాయుడి పైశాచికత్వం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘బిగ్‌ బాస్‌’పై మరో వివాదం

టాక్‌ బాగున్నా.. కలెక్షన్లు వీక్‌!

 ఆ హీరోయిన్‌కు సైబర్‌ షాక్‌

మూడు నెలల అనంతరం రిజెక్ట్‌ చేశారు..

కంగనా రనౌత్‌కు ‘మెంటలా’!

డ‌బ్బింగ్ కార్యక్రమాల్లో ‘మ‌న్మథుడు 2’