ఇంట్లోనూ నిఘానేత్రం 

12 Aug, 2019 05:03 IST|Sakshi

14,200 సీసీ కెమెరాల ఏర్పాటుకు పోలీసుల ప్రతిపాదనలు  

నేర పరిశోధనలో కీలకంగా మారిన సీసీ కెమెరాలు 

నేరం జరగ్గానే ముందు చూసేది సీసీ కెమెరాల పుటేజ్‌నే 

ప్రధాన కూడళ్లు, రద్దీ ప్రాంతాల్లో సీసీ కెమెరాల కన్ను 

- ఒడిశా రాష్ట్రంలో రూ.13.50 లక్షల విలువైన పేపర్‌ రోల్స్‌తో బయలుదేరిన లారీ బెంగళూరుకు చేరకుండా దారి మళ్లించి 14 చెక్‌పోస్టులు దాటుకెళ్లిపోయినప్పటికీ పట్టుకున్న విజయనగరం వన్‌టౌన్‌ పోలీసులు అవార్డు ఫర్‌ బెస్ట్‌ క్రైమ్‌ డిటెక్షన్‌ (ఏబీసీడీ అవార్డు)ను అందుకున్నారు. అదేమంటే వారి నేర  పరిశోధనలో చెక్‌పోస్టుల వద్ద ఉన్న  క్లోజ్డ్‌ సర్క్యూట్‌ (సీసీ)కెమెరాలే కీలకంగా ఉపయోగపడ్డాయి.  

- కడప జిల్లా రైల్వే కోడూరులో జరిగిన షేక్‌ అబ్దుల్‌ ఖదీర్‌(26) హత్య కేసు మిస్టరీని చేధించిన పోలీసులకు కూడా అవార్డు లభించింది. మిస్టరీగా మారిన ఈ కేసులో కూడా వాట్సాప్‌ చాటింగ్‌ కొంత క్లూ ఇస్తే నేర స్థలంలో ఉన్న సీసీ కెమెరాలే నేరస్తులను గుర్తించేలా దోహదపడ్డాయి.  

సాక్షి, అమరావతి: ఇలా సీసీ కెమెరాల పుటేజ్‌ పోలీసులకు కీలకంగా మారింది. దీంతో అన్నిప్రాంతాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పటికే ప్రధాన నగరాలు,  జిల్లా కేంద్రాల్లో ట్రాఫిక్, జన సంచారం ఉంటే ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌లతో అనుసంధానించారు. రాష్ట్ర పోలీస్‌ శాఖ పరిధిలో 8,148 సీసీ కెమెరాలను నిర్వహిస్తున్నారు. దీనికితోడు రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌(ఆరీ్టజీఎస్‌) ఆధ్వర్యంలో పట్టణ ప్రాంతాల్లోనే కాకుండా గ్రామ స్థాయిలోనూ అనేక ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే 5,200 సీసీ కెమెరాలు ఉండగా మరో 14,200 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేలా ఈ ఏడాది జూలైలో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వీటితోపాటు ప్రతీ ఇంటింటికి నిఘా నేత్రాన్ని విస్తరించేలా రాష్ట్ర పోలీసులు కొత్త ప్రతిపాదనలు చేశారు. తొలుత వీధుల్లో ఏర్పాటు చేసి ఆ ప్రాంతంలోని ఇళ్లను కవర్‌ చేసేలా చూస్తారు. అటు తరువాత ప్రజలను చైతన్యం చేసి ప్రతీ ఇంటిలో వారే సొంతంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా దశలవారీ కార్యచరణ చేపట్టనున్నారు. 

ఎల్‌హెచ్‌ఎంఎస్‌కు సీసీ కెమెరాల కొరత..
రాష్ట్రంలో పోలీసు శాఖ వినూత్నంగా చేపట్టిన లాక్డ్‌ హౌస్‌ మోనటరింగ్‌ సిస్టం(ఎల్‌హెచ్‌ఎంఎస్‌) ఒక మేరకు ఫలితాలు ఇచ్చింది. దాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తృతం చేసేందుకు పోలీసు శాఖకు సీసీ కెమెరాల కొరత ఉందని పోలీసు అధికారులు చెబుతున్నారు. ఎవరైనా ఇంటి యజమాని కొద్ది రోజులపాటు తన ఇంటికి తాళం వేసి ఇతర ప్రాంతానికి వెళితే స్థానిక పోలీసులకు సమాచారం అందించాల్సి ఉంటుంది. అలా చేస్తే పోలీసులు స్వయంగా వచ్చి ఆ ఇంట్లో 24 గంటలపాటు నిఘా ఉంచేలా సీసీ కెమెరాలతో కూడిన ఎల్‌హెచ్‌ఎంఎస్‌ యూనిట్‌ అమర్చుతారు. తాళం వేసిన ఆ ఇంట్లోకి ఆ తరువాత ఎవరైనా వస్తే సమీపంలోని పోలీసు స్టేషన్‌కు అలారంతో కూడిన సంకేతాలు ఇస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎల్‌హెచ్‌ఎంఎస్‌ ఏర్పాటు కోసం 8,12,450 విజ్ఞాపనలు రాగా 3,80,79 విజ్ఞప్తులను పోలీసులు పరిగణలోకి తీసుకున్నప్పటికీ తొలి ప్రయత్నంగా 24,473 ఇళ్లలో మాత్రమే వీటిని అమర్చారు. ఇది మంచి ఫలితాలు ఇచి్చంది.   

ప్రతి ఇంటికి సీసీ కెమెరా..డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ 
పోలీసులు గతంలో నేర స్థలంలో వేలిముద్రలు, ఇతర ఆధారాలకోసం వెదికేవారు. ఇప్పుడు నేరస్థలంలో మొదట సీసీ కెమెరా పుటేజీ కోసం ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రధాన ప్రాంతాలు, జన సంచారం ఉండే చోట సీసీ కెమెరాల ఏర్పాటు చేస్తున్నాం. ఇళ్లలో దొంగతనాలను అరికట్టేందుకు ఎల్‌హెచ్‌ఎంఎస్‌ను పోలీసు శాఖ వినియోగంలోకి తెచ్చింది. ప్రతీ ఇంటికి వారే సీసీ కెమెరా ఏర్పాటు చేసుకునేల ప్రజలను చైతన్యం చేస్తాం. నేరస్తుడు సీసీ కెమెరా ఉన్న ఇంటికి వెళ్లాలంటే దొరికిపోతాం అనే భయపడే పరిస్థితి రావాలి. దీని వల్ల నేరాలు జరిగిన తర్వాత దర్యాప్తు కంటే నేరాలు జరగకుండా అరికట్టేందుకు సీసీ కెమెరాలు ఉపయోగపడతాయి.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

స్వాతంత్య్ర వేడుకలకు సర్వం సిద్ధం

కాపుల అభివృద్ధికి కృషి చేస్తా

సుపరిపాలనను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

ముప్పు తప్పింది.. ముంపు మిగిలింది

బూట్ల పేరిట రూ.కోట్లకు ఎసరు!

‘సచివాలయ’ ఉద్యోగాలకు 22.70 లక్షల దరఖాస్తులు

బెజవాడలో ఘోరం

జోరుగా జల విద్యుదుత్పత్తి

ఎన్నాళ్లకెన్నాళ్లకు.. జలకళాంధ్ర..

రెండు పంటలకు ఢోకా లేనట్లే!

పాకిస్తాన్‌ను సమర్థిస్తే జైలుకే

అల్లా ఆశీస్సులు ప్రజలందరికీ లభించాలి: వైఎస్‌ జగన్‌

అలీఖాన్‌ కుటుంబాన్ని పరామర్శించిన సీఎం జగన్‌

ఈనాటి ముఖ్యాంశాలు

తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకోవాలి: వినాయక్‌

తుంగభద్ర 33 గేట్లు ఎత్తివేత..

‘మంగళగిరి వెళ్లి అడగండి తెలుస్తుంది’

ఆవులపై విష ప్రయోగం జరగలేదు

‘చంద్రబాబును కాపులు ఇక జీవితంలో నమ్మరు’

కాపుల సమావేశానికి వెళ్తే చంద్రబాబు నిలదీశారు

బూరెలతో మొక్కు తీర్చుకున్నారు..

‘మా కుటుంబానికి వైఎస్‌ రాజశేఖరరెడ్డి దైవం’

ప్రభుత్వ నిర్ణయంతో పేదింట వెలుగులు

సాగర్‌ ఆయకట్టుకు నీటి విడుదల

బహుదూరపు బాటసారి అమెరికాయానం...

‘ఆశ’ నెరవేరింది

‘కాపుల కోసం ఆయన ఒక పని కూడా చేయలేదు’

ఎస్‌ఎస్‌ఏ పోస్టులకు పైరవీలు

అయ్యారే.. తమ్ముళ్ల నీతి..!

ఈ పాలకు మస్తు గిరాకి.. 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

కొత్త లుక్‌లో థ్రిల్‌

అనుకోని అతిథి

ఫోరెన్సిక్‌ పరీక్షల నేపథ్యంలో...

ఏడేళ్ల తర్వాత?

కొత్తగా చేయటం నాన్న నుంచి నేర్చుకున్నా

కో అంటే కోటి గుర్తుకొచ్చింది