హలో.. పౌచ్‌ అదుర్స్‌

23 Aug, 2018 12:10 IST|Sakshi
పౌచ్‌లపై అంటించడానికి సిద్ధంగా వివిధ రకాల స్టిక్కర్లు

సెల్‌ఫోన్లకు అందమైన పౌచ్‌లు

ఆకర్షితులవుతున్న యువత

ఉపాధి కల్పిస్తున్న సృజనాత్మకత

పార్వతీపురం :  వినూత్నంగా ఆలోచించగలిగితే.. సృజనాత్మకత ప్రదర్శించగలిగితే.. ఉపాధి పొందడానికి కాదేదీ అనర్హం. డిగ్రీలు చేత పట్టుకొని ఉద్యోగాలు రాక ఖాళీగా రోడ్లమీద తిరిగేవారు కొందరైతే.. కష్టపడేతత్వం ఉంటే చాలు బతికేయడం చాలా సులువని నిరూపించేవారు మరికొందరు. సెల్‌ఫోన్‌ పౌచ్‌లను అందంగా కావలసిన బొమ్మలతో తీర్చిదిద్దుతూ ఉపాధి పొందుతున్న యువకులు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. పొట్ట చింపితే అక్షరం రాని ఈ యువకులు సెల్‌ఫోన్‌ పౌచ్‌లను అందంగా తయారు చేస్తూ నెలకు రూ.30 వేల వరకు సంపాదిస్తున్నారు.

సెల్‌ఫోన్‌ వినియోగదారుల ఆసక్తి మేరకు విజయవాడ, ముంబయ్‌ ప్రాంతాల నుంచి వివిధ రకాల స్టిక్కర్లను తెప్పించి వాటిని సెల్‌ఫోన్‌ పౌచ్‌లకు అందంగా అతికిస్తున్నారు. సినీ హీరోలు, హీరోయిన్లు, జాతీయ నేతలు, స్వాతంత్య్ర సమరయోధులు, స్వాతంత్య్ర జెండాలు వంటి అనేక మోడళ్ల స్టిక్కర్లను పౌచ్‌లకు నిమిషాల వ్యవధిలో అతికించి అందంగా తీర్చిదిద్దుతున్నారు. చక్కని ఆదాయంతో కుటుంబాన్ని పోషిస్తున్నారు. వీరఘట్టానికి చెందిన షేక్‌ అబ్దుల్‌ పౌచ్‌ల తయారీతో ఉపాధి పొందుతూ పదిమందికి స్ఫూర్తినిస్తున్నాడు.

వినియోగదారుల ఆసక్తే మా ఉపాధి

సెల్‌ఫోన్‌ వినియోగదారుల ఆసక్తే మాకు ఉపాధి చూపిస్తోంది. ప్రస్తుతం ప్రతి వ్యక్తి సెల్‌ఫోన్‌ వినియోగిస్తున్నారు కాబట్టి దానికి రక్షణగా ఉండే పౌచ్‌ను అందంగా తీర్చిదిద్దే పనిని నేర్చుకొని ఉపాధి పొందుతున్నాను. యువత కూడా ఎన్నో రకాల డిజైన్లను పౌచ్‌లపై వేయించుకుంటోంది. రోజూ రూ.1000 నుంచి రూ.2 వేల వరకు ఆదాయం లభిస్తుంది. 

– షేక్‌ అబ్దుల్లా, వీరఘట్టం

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా