మూడు వైద్య కళాశాలలకు కేంద్రం అనుమతి

21 Mar, 2020 04:19 IST|Sakshi

పాడేరు, మచిలీపట్నం, గురజాల వైద్య కళాశాలలకు ఓకే 

ఒక్కో కళాశాలకు రూ. 195 కోట్ల మేర కేంద్రం సాయం

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న 7 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో మూడు కాలేజీలకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అనుమతి ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి అమిత్‌ బిశ్వాస్‌ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ పంపించారు. పాడేరు, గురజాల, మచిలీపట్నం వైద్య కళాశాలలకు అనుమతించారు. ఒక్కో కళాశాలకు రూ. 325 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేయగా ఇందులో 60 శాతం కేంద్రం, 40 శాతం రాష్ట్రం భరిస్తుంది. ఈ లెక్కన ఒక్కో కళాశాలకు కేంద్రం నుంచి రూ. 195 కోట్ల నిధులు వస్తాయి. రాష్ట్ర ప్రభుత్వం రూ. 130 కోట్లు వ్యయం చేస్తుంది. త్వరలోనే ఈ మూడు వైద్య కళాశాలలకు సంబంధించి కేంద్రంతో అవగాహనా ఒప్పందం చేసుకుంటామని వైద్య విద్యా సంచాలకులు డా.వెంకటేష్‌ సాక్షితో అన్నారు. 

>
మరిన్ని వార్తలు