అమరావతి ఆందోళనలపై కేంద్ర హోంశాఖ కీలక వ్యాఖ్యలు

4 Feb, 2020 17:35 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : అధివృద్ధి వికేంద్రీకరణకు వ్యతిరేకంగా అమరావతి ప్రాంతంలో గత కొంతకాలంగా టీడీపీ చేస్తున్న ఆందోళనలపై కేంద్ర హోంశాఖ కీలక వ్యాఖ్యలు చేసింది. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునే హక్కు, బాధ్యత రాష్ట్రాలకు ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు లోక్‌సభలో చర్చ సందర్భంగా టీడీపీ సభ్యుడు కేశినేని నాని అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సమాధానమిచ్చింది. అధివృద్ధికి విఘాతం కలిగించేలా చట్టవిరుద్ధమైన కార్యక్రమాలు చేపడితే చర్యలు తీసుకునే బాధ్యత పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికే ఉంటుందని తెలిపింది.

కేంద్ర ప్రభుత్వం కేవలం శాంతిభద్రతలను మాత్రమే పర్యవేక్షిస్తుందని, అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు కేంద్రం అదనపు బలగాలను కూడా పంపిస్తుందని పేర్కొంది. అయితే అమరావతిలో అందోళనల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి ప్రతిపాదనలు రాలేదని కేంద్రం స్పష్టం చేసింది. కాగా అభివృద్ధి వికంద్రీకరణకు వ్యతిరేకంగా రైతుల ముసుగులో టీడీపీ నేతలు అమరావతిలో ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే.

>
మరిన్ని వార్తలు