రెడ్‌జోన్‌ ప్రాంతాలను పరిశీలించిన కేంద్ర బృందం

11 May, 2020 19:48 IST|Sakshi
(ఫైల్‌ ఫోటో)

సాక్షి, కర్నూలు: రాష్ట్రంలోని తాజా పరిస్థితులను సమీక్షించేందుకు కేంద్ర ప్రత్యేక బృందం రాష్ట్రానికి వచ్చిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్న కేంద్ర బృందం కరోనా కట్టడికి తీసుకుంటున్న సాంకేతిక టెక్నాలజీ గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ బృందంలో డా. మధుమిత దూబే, ప్రొఫెసర్‌ సంజయ్‌ కుమార్‌, సాధూఖాన్‌ ఉన్నారు. పర్యటనలో భాగంగా రెడ్‌జోన్‌ ప్రాంతాలలో సాంకేతిక పరిజ్ఞానంతో కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలను పరిశీలించారు. డ్రోన్‌ కెమెరాల పనితీరును ఫాల్కన్, హాక్‌ వాహనాల నుంచి పర్యవేక్షించారు.

కర్నూలు నగరంలోని కొత్తపేట, పాతబస్తీ, కొండారెడ్డి బురుజు ప్రాంతాలు, నగరంలో ఏర్పాటు చేసిన బారికేడ్లు, పోలీసు, మున్సిపల్‌, వైద్య బృందాల విధులు, ప్రధాన మార్గాలను కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులు నగరంలో కరోనా నివారణకు తీసుకుంటున్న చర్యలపై వివరణ ఇచ్చారు. రోడ్లపై అనవసరంగా తిరిగే ద్విచక్ర వాహనాలను, కార్లలో తిరిగే వ్యక్తులను డ్రోన్‌ కెమెరా ద్వారా నిఘా పెట్టి వాహనాలను సీజ్‌ చేస్తున్నట్లు కేంద్ర బృందానికి జిల్లా ఎస్పీ రాఘవ తెలిపారు. కార్యక్రమంలో కర్నూలు పట్టణ డీఎస్పీ బాబా ఫకృద్దీన్‌, సీఐ మహేశ్వర రెడ్డి, ఈ కాప్స్‌ ఇంచార్జ్‌ రాఘవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. చదవండి: ఏపీలో కరోనా నివారణ చర్యలు భేష్‌

మరిన్ని వార్తలు