పవర్‌ పాయింట్‌ ప్రజెంటెషన్‌తో వివరాల వెల్లడి

8 May, 2020 16:03 IST|Sakshi

సాక్షి, అమరావతి:‌ కరోనా వైరస్‌ నియంత్రణ చర్యల పరిశీలినపై అంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ ప్రత్యేక  ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డితో , కేంద్ర బృందం ఏర్పాటు చేసిన భేటీ ముగిసింది. కేంద్ర బృందం శుక్రవారం ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో వైద్యశాఖ అధికారులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కరోనా మహమ్మారి నియంత్రణకు ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కేంద్ర బృందాలకు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా  అధికారులు వివరించారు.  ఏపీలో పెద్ద ఎత్తున పరీక్షలు చేస్తున్నామని, జిల్లాల వారిగా కరోనా మహమ్మారిపై నియంత్రణ చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. (దాతృత్వాన్ని పెంపొందించుకోవాలి: జవహర్‌రెడ్డి)

క్షేత్రస్థాయిలో హౌస్‌హోల్డ్‌ సర్వే, జ్లిలాల వారీగా కరోనా పరీక్షలను వైద్యశాఖ అధికారుల కేంద్ర బృందానికి వివరించారు. క్వారంటైన్‌ కేంద్రాల్లో అందిస్తున్న పౌష్టికాహారం వివరాలు, ఫార్మసీ యాప్‌ పని తీరును అధికారుల వివరించారు. ఇక కరోనా అనుమానితుల శాంపిల్స్‌ను తొందరగా తెప్పిస్తున్నామని, ఇప్పటి వరకు లక్షా 84 వేల శాంపిల్స్‌ను తీసుకున్నామని అధికారులు వెల్లడించారు.  ఇంకా 25, 539 శాంపిల్స ఫలితాలు పెండింగ్‌లో ఉన్నాయని, కరోనా డెత్‌ రేట్‌ విషయంలో మిగిలిన రాష్ట్రాల కంటే ఏపీ 2.07 శాతం మెరుగ్గా ఉందని చెప్పారు. ప్రతిరోజు వైద్య అధికారులు, ఆశా వర్కర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తున్నామని అధికారలు కేంద్ర బృందానికి వెల్లడించారు. (ఏపీలో 54 కరోనా పాజిటివ్ కేసులు)

>
మరిన్ని వార్తలు