కరువు సీమకు కల్పతరువు..

17 May, 2018 13:33 IST|Sakshi

 నాడు సంప్రదాయ కోర్సులకు శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం, సాంకేతిక విద్యకు జెఎన్‌టియూ

నేడు ఆధునిక కోర్సులకు కేంద్రీయ విశ్వవిద్యాలయం

సాక్షి, అనంతపురం : ప్రతిష్టాత్మక సెంట్రల్‌ యూనివర్శిటీ జిల్లాలో ప్రారంభం కానుంది. యూనివర్శిటీ ఏర్పాటుకు కేంద్రం నుంచి నిధులు మంజూరయ్యాయని, ఈ విద్యా సంవత్సరం నుంచే తరగతులను
ప్రారంభిస్తామని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. శాశ్వత భవనాలను నిర్మించేంత వరకు తరగతులను తాత్కాలికంగా ఎస్కేయూ, జెఎన్‌టియూ క్యాంపస్‌లో నిర్వహిస్తామని తెలిపారు.  గత
విద్యాసంవత్సరం నుంచే సెంట్రల్‌ యూనివర్శిటీ తరగతులు ప్రారంభించాలని ప్రతిపాదనలు ఉన్నప్పటికీ కార్యరూపం దాల్చలేదు. తరగతుల నిర్వ‌హ‌ణ‌కు స‌రైన స్థలాన్ని గుర్తించాల‌ని క‌మీష‌న‌ర్ పాండాదాస్‌ను
మంత్రి గంటా శ్రీనివాస‌రావు  ఆదేశించారు. 

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ ఉన్నతాధికారులతో చర్చించి విధివిధానాలు ఖరారు చేయాలని సూచించారు. దేశంలోని సెంట్రల్‌ యూనివర్శిటీలకు ఏ మాత్రం తీసిపోని విధంగా యూనివర్శిటీని అభివృద్ధి చేస్తామన్నారు. ఇప్పటికే జిల్లాలో సంప్రదాయ కోర్సులు నిర్వహిస్తున్న శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం, సాంకేతిక విద్యను అందిస్తున్న జెఎన్‌టియూ ఉన్నాయి.
సెంట్రల్‌ యూనివర్శిటీ ఏర్పాటుతో జిల్లాలో మూడు యూనివర్శిటీలు విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాట వేయనున్నాయి. కురువు సీమను విద్యా సీమగా చూడాలన్నదే మా లక్ష్యమని మంత్రి తెలిపారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు