‘నిబంధనల ఉల్లంఘన జరగలేదు’

7 Mar, 2020 20:36 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : పోలవరం పనులు, ఎం బుక్‌పై విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ పరిశీలన జరుగుతోందని, ఏవైనా అక్రమాలు అని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర జలశాఖ వెల్లడించింది. నూతన ప్రభుత్వంలో  పోలవరం కాంట్రాక్ట్‌ కేటాయింపుల్లో ఎలాంటి నిబంధనల ఉల్లంఘన జరగలేదని అన్నారు. కాంపిటెంట్‌ అథారిటీ ఆమోదం తెలిపిన తర్వాతే కాంట్రాక్ట్‌ కేటాయింపు జరిగిందని కేంద్ర జల శక్తి శాఖ ప్రధాన కార్యాలయానికి తెలిపింది. టీడీపీ హయాంలో పునరావాస ప్యాకేజీలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ప్రధానమంత్రి కార్యాలయానికి పెంటపాటి పుల్లారావు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై సవివర నివేదికను ప్రధానమంత్రి కార్యాలయానికి కేంద్ర జల శక్తిశాఖ పంపింది.

పునరావాస పనులను పరిశీలించేందుకు రెండు పర్యవేక్షణ కమిటీలు ఏర్పాటు చేశామని కేంద్ర మంత్రిత్వ శాఖ తెలిపింది. పునరావాసంలో అక్రమాలకు పాల్పడిన జంగారెడ్డిగూడెం ఆర్డీవో, పోలవరం తహసిల్దార్‌పై ఏసీబీ కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. నవంబర్ 13, 2019 లో పోలవరం కాంట్రాక్టు కేటాయింపులలో నిబంధనల ఉల్లంఘన జరగలేదని, అధీకృత సంస్థ ఆమోదం తర్వాత నిర్ణయాలు జరిగాయని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసిన విషయాన్ని కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ తెలిపింది. 

మరిన్ని వార్తలు