‘ఏపీకి రెండు విడతల్లో రూ. 6,953 కోట్ల సాయం చేశాం’

5 Feb, 2020 18:56 IST|Sakshi

ఎంపీ విజయసాయి రెడ్డి ప్రశ్నకు గృహ నిర్మాణ శాఖ మంత్రి జవాబు

న్యూఢిల్లీ : ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన (పట్టణం) పథకం కింద 2015-16 నుంచి 2019-20 వరకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి రెండు విడతల్లో రూ. 6,953 కోట్లు ఆర్థిక సహాయం అందించినట్లు గృహ నిర్మాణ శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరి రాజ్యసభలో బుధవారం తెలిపారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి ఈమేరకు లిఖితపూర్వ సమాధానం ఇచ్చారు. లబ్దిదారులకు వడ్డీ సబ్సిడీ కింద మరో 436.54 కోట్ల రూపాయల్ని ఏపీకి అందించినట్టు మంత్రి చెప్పారు.
(చదవండి : పవన్‌కు బీజేపీ పెద్దలు క్లాస్ పీకినట్టున్నారు!)

లక్షా 24 వేల ఇళ్ల నిర్మాణానికి సంబంధించి కేంద్రం చేసే 40 శాతం ఆర్థిక సాయంలో మొదటి వాయిదాను ఇంకా విడుదల చేయాల్సి ఉందని పేర్కొన్నారు. ఈ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి లబ్దిదారుల జాబితా, వారి ఆధార్‌ కార్డు వివరాలు, వినియోగ పత్రాలు రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన అనంతరం నిధులను విడుదల చేస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన డీపీఆర్‌ ప్రకారం ఈ ఇళ్లు 18 నెలల్లో పూర్తి చేయాల్సి ఉంది.
(చదవండి : ఆశావహ జిల్లాల్లో విశాఖ ముందంజ)

>
మరిన్ని వార్తలు