రెచ్చిపోతున్న చైన్‌స్నాచర్లు

18 Jul, 2014 01:14 IST|Sakshi
రెచ్చిపోతున్న చైన్‌స్నాచర్లు

*మహిళలే లక్ష్యంగా గొలుసు దొంగతనాలు
* తాడేపల్లిగూడెంలో వారం రోజుల్లో మూడు ఘటనలు
 తాడేపల్లిగూడెం రూరల్ : తాడేపల్లిగూడెంలో చైన్‌స్నాచర్లు రెచ్చిపోతున్నారు.. ఒంటిపై ఆభరణాలతో నడిచి వెళ్తున్న మహిళలే లక్ష్యంగా దోపిడీలకు తెగబడుతున్నారు. పట్టణంలో వారం రోజుల్లో వ్యవధిలో మూడు ఘటనలు చోటు చేసుకున్నారుు. గురువారం సాయంత్రం స్థానిక వీకర్స్ కాలనీకి చెందిన శ్రీధర గాయత్రి వాణి తన కుమారుడికి సంగీతం నేర్పించేందుకు తె నుకుల కోటయ్య వీధిలో ఉండే టీచర్ ఇంటికి తీసుకెళ్తుండగా.. వీధిలోకి వెళ్లేసరికి ఎదురుగా మోటార్ సైకిల్‌పై వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి ఆమె మెడలోని బంగారు సూత్రాల తాడును లాక్కుపోయూడు. గట్టిగా పట్టుకోవడంతో సూత్రాలు ఆమె చేతిలోనే ఉండిపోయాయి.
 
బాధితురాలి ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. రెండు రోజుల క్రితం పట్టణంలోని కృష్ణుడు చెరువు వద్ద ఓ మహిళ మెడలోని బంగారు గొలుసును గుర్తు తెలియని వ్యక్తి తెంపుకుపోయూడు. వారం రోజుల క్రితం ఇదే ప్రాంతంలో మరో చైన్‌స్నాచింగ్ జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. వారంలో వరుసగా మూడు చోరీలు జరగడంతో స్థానిక మహిళలు బయటకు రావడానికే భయపడుతున్నారు. ఈ ఘటనలన్నీ పట్టపగలే జరగడం గమనార్హం. చైన్‌స్నాచింగ్‌లపై పోలీస్ నిఘా పెట్టాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
 
గుండుగొలనులో ఆభరణాల చోరీ
 భీమడోలు : ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు బీరువాలోని 4 కాసుల బంగారు ఆభరణాలను ఎత్తుకుపోయూరు. భీమడోలు పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ అమీర్ తెలిపిన వివరాల ప్రకారం.. గుండుగొలను గ్రామం వేగిరెడ్డివారి వీధిలో నివాసం ఉంటున్న పోలా సింహాచలం కుమార్తె కుసుమకు వివాహం కాగా, కైకరంలోని అత్తారింట్లో ఉంటోంది. అనారోగ్యంగా ఉండడంతో కొద్దిరోజుల క్రితం పుట్టింటికి వచ్చింది. బుధవారం రాత్రి మెడలోని బంగారు నానుతాడు, చెవిదిద్దెలతో పాటు ఇతర ఆభరణాలను బీరువాలో భద్రపరిచింది. ఇంటి తలుపులు తెరిచి ఉండడంతో అర్ధరాత్రి సమయంలో లోనికి ప్రవేశించిన దొంగలు బీరువాలో పెట్టిన బంగారు ఆభరణాలను దోచుకుపోయూరు. ఉదయాన్నే నిద్రలేచిన ఇంట్లోని వారంతా బీరువా తలుపులు తెరిచి ఉండడంతో కంగారుపడి ఆభరణాల కోసం వెతికారు. అనంతరం చోరీకి గురైనట్లు గుర్తించి భీమడోలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మరిన్ని వార్తలు