‘చలన చిత్ర పరిశ్రమ తీరు బాధాకరం’

26 Jan, 2019 14:31 IST|Sakshi

సాక్షి, పశ్చిమగోదావరి : విభజన హామీలను తక్షణమే అమలు చేయాలని ఆంధ్ర మేధావుల ఫోరమ్‌ కన్వీనర్‌ చలసాని శ్రీనివాస్‌, ప్రత్యేక హోదా- విభజన హామీల సాధన సమితి కన్వీనర్‌ చలసాని శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు. పాలకొల్లులో శనివారం విలేకరులతో మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్‌కు వెంటనే ప్రత్యేక హోదా ప్రకటించాలని కోరారు. రైల్వే బడ్జెట్‌లో గుజరాత్‌కు రూ. 500 ఓట్లకు పైగా కేటాయించిన కేంద్రం.. ఆంధ్రప్రదేశ్‌కు కనీసం బడ్జెట్‌లో స్థానం కల్పించకపోవడం శోచనీయమన్నారు. ఇందుకు నిరసనగా ఫిబ్రవరి 1న రాష్ట్ర బంద్‌కు పిలుపునివ్వనున్నట్లు తెలిపారు. అదే విధంగా ఆరోజు నిర్వహించే ఓట్‌ ఆఫ్‌ పేజ్‌లో ప్రతీ ఒక్కరు పాల్గొని మన సత్తా చాటాలని పిలుపునిచ్చారు.

విభజన హామీల విషయమై చలన చిత్ర పరిశ్రమ స్పందించకపోకపోవడం చాలా బాధాకరమని చలసాని ఆవేదన వ్యక్తం చేశారు. తమిళనాడులో సాంప్రదాయ జల్లికట్టు విషయమై తమిళ చలనచిత్ర పరిశ్రమ ఒకే తాటి పైకి వచ్చి తమ వంతు సహాయ సహకారాలు అందించారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.

మరిన్ని వార్తలు