నిరుద్యోగ యువత ఆశలపై నీళ్లు  

4 Aug, 2018 12:05 IST|Sakshi
 మాట్లాడుతున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఉత్తరాంధ్ర కన్వీనర్‌ కోలగట్ల  

ఆశపడి ఓట్లేసిన వారిని నిలువునా ముంచిన చంద్రబాబు సర్కారు

యువతకు జరిగిన మోసాలపై 11న విజయనగరంలో నిరసన ర్యాలీ

ఎమ్మెల్సీ, వైఎస్సార్‌ సీపీ ఉత్తరాంధ్ర కన్వీనర్‌ కోలగట్ల  

విజయనగరం మున్సిపాలిటీ : ఎన్నికలకు ముం దు మాయమాటలు చెప్పి నిరుద్యోగ యువత ఓట్ల దక్కించుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు వారి ఆశలపై నీళ్లు చల్లారని  ఎమ్మెల్సీ, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఉత్తరాంధ్ర కన్వీనర్‌ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. తన నివాసం లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన  మాట్లాడారు.

2014 సాధారణ ఎన్నికల్లో ఇంటికొక ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి రెండు వేలు ఇస్తామని, ఎన్నికలప్పుడు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి న తరువాత వారి జీవితాలతో ఆటలాడుకుంటోందన్నారు.  ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అరకొర నిధులతో నిరుద్యోగ యువతకు వెయ్యి రూపాయలు భృతి అంటూ ప్రకటనలు చేయడం కంటితుడుపు చర్యగా అభివర్ణించారు.

వయో పరిమి తిని 35 ఏళ్లకు పరిమితం చేయడం ద్వారా చాలా మంది నిరుద్యోగ యువతను అనర్హులుగా చేస్తున్నారన్నారు.  పచ్చ చొక్కా నాయకులకే ఆ భృతిని పరిమితం చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయని చెప్పారు. చంద్రబాబుకు రానున్న ఎన్నికల్లో  గుణపాఠం చెప్పటం ఖాయమన్నారు. 

11న  నిరుద్యోగుల యువ గర్జన

నిరుద్యోగులకు, యువతకు ముఖ్యమంత్రి చం ద్రబాబు చేసిన మోసానికి నిరసనగా ఈ నెల 11న శనివారం పట్టణంలో యువగర్జన పేరిట నిరసన ర్యాలీ నిర్వహించనున్నట్టు ప్రకటిం చారు. ఆ రోజు  ఉదయం 10 గంటలకు కోట నుంచి ప్రారంభమయ్యే యువగర్జన ర్యాలీకి  పెద్ద ఎత్తున నిరుద్యోగులు యువత పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

జిల్లా యువ జన విభాగం అధ్యక్షుడు  సం ఘం రెడ్డి బంగారునాయుడు, రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి జి.వి.రంగారావు, జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షులు ఎంఎల్‌ఎన్‌.రాజు, జిల్లా యువజన విభా గం ప్రధాన కార్యదర్శి బోడేసింగి ఈశ్వరరావు, పట్టణ యువజన విభాగం అధ్యక్షుడు చాణక్య, రాష్ట్ర విద్యార్థి విభాగం కార్యదర్శి పొట్నూరు కేశవ్, కరకవలస అనిల్, పట్టణ విద్యార్థి విభాగ అధ్యక్షుడు నెలపర్తి రాజకుమార్‌లతో పాటు యువజన విద్యార్థి విభాగం నాయకులు తాడ్డి సురేష్, అవాల కుమార్, చిన్ని, రవితేజ, సప్పా ప్రసాద్,వైగేర్‌ ప్రసాద్, తరుణ్,తెడ్ల ప్రసాద్‌ , బూడి అప్పలరాజు, బాలు,రజనీ, శెట్టి సుధాకర్, రమేష్, దివాకర్, సురేష్,, గుప్త, కృష్ణ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు