నా ఇల్లు మంత్రులు చూడ్డమేంటి ? : చంద్రబాబు

24 Aug, 2019 04:28 IST|Sakshi

సాక్షి, అమరావతి: కృష్ణా నది వరదలపై సీఎం, మంత్రులు ఒక్కరోజు కూడా సమీక్ష చేయలేదని ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆరోపించారు. తాను లేనప్పుడు తన ఇల్లు మునిగిపోతోందని ముగ్గురు మంత్రులు చూడటానికి రావడమేమిటని ప్రశ్నించారు. గుంటూరులోని టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కృష్ణా వరదలు ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా చేసిన దుర్మార్గపు చర్య అని విమర్శించారు.

వరదలు వస్తాయని వాతావరణ శాఖ, ఇస్రో ఎప్పటికప్పుడు సమాచారమిచ్చినా ప్రభుత్వం స్పందించలేదన్నారు. ఆల్మట్టి నుంచి ప్రకాశం బ్యారేజీకి వరద నీరు రావడానికి నాలుగు రోజులు సమయం పడుతుందని, ఎప్పటికప్పుడు పరిశీలించి తగిన కార్యాచరణ చేపట్టి ఉంటే ఇంత నష్టం జరిగేది కాదని అన్నారు. వరద వస్తున్నపుడు రాయలసీమలో ఖాళీగా ఉన్న రిజర్వాయర్లను నింపుదామన్న ఆలోచన ప్రభుత్వానికి లేకుండా పోయిందన్నారు.

మరిన్ని వార్తలు