చంద్రబాబు ఢిల్లీ పర్యటన రద్దు

18 Jul, 2017 09:46 IST|Sakshi
చంద్రబాబు ఢిల్లీ పర్యటన రద్దు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ్టి ఢిల్లీ పర్యటన రద్దు చేసుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వెంకయ్య నాయుడు నామినేషన్‌ కార్యక్రమానికి హాజరవుతానని అంతకుముందు ఆయన ప్రకటించారు. దీని కోసం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కూడా రద్దు చేస్తున్నట్టు తెలిపారు. చంద్రబాబు ప్రకటించిన గంటలోనే పరిణామాలు మారిపోయాయి. ఢిల్లీ పర్యటన రద్దు చేసుకున్నారు. అంతేకాదు యధావిధిగా కేబినెట్‌ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు.

ఈ అంశం అధికార టీడీపీలో చర్చనీయాంశంగా మారింది. వెంకయ్య నామినేషన్‌ సమర్పణ కార్యక్రమానికి చంద్రబాబును ఆహ్వానించారా లేదా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఆహ్వానించకుండా వెళ్తే బాగోదన్న ఆలోచనతోనే చంద్రబాబు ఢిల్లీ పర్యటన మానుకున్నట్టు తెలుస్తోంది. దీనిపై సీఎం ఆఫీసు, టీడీపీ కార్యాలయం ఎటువంటి వివరణ ఇవ్వలేదు. మొత్తానికి ఈ వ్యవహారం టీడీపీలో కొత్త చర్చకు, మలుపుకు దారితీసిందని చెప్పవచ్చు.

మరిన్ని వార్తలు