ఫర్నీచర్‌పై చంద్రబాబు పచ్చి అబద్ధాలు

21 Sep, 2019 05:05 IST|Sakshi

తన ఇంటికి తరలించినట్లు ఒప్పుకున్న మాజీ స్పీకర్‌

ఆయన మరణించాక దాన్ని అడ్డగోలుగా వక్రీకరిస్తున్న మాజీ సీఎం

తమ అధినేత తీరుపై తమ్ముళ్ల విస్మయం..

తన ఇంటికి తరలించినట్లు ఒప్పుకున్న మాజీ స్పీకర్‌

ఆయన మరణించాక దాన్ని అడ్డగోలుగా వక్రీకరిస్తున్న మాజీ సీఎం

తమ అధినేత తీరుపై తమ్ముళ్ల విస్మయం..

‘అందరికీ ఇచి్చనట్లే క్యాంపు కార్యాలయం కోసం అప్పటి స్పీకర్‌ కోడెల శివప్రసాదరావుకు ఫర్నీచర్‌ ఇచ్చారు. వాటిని ఆయన తన కార్యాలయంలో వాడుకున్నారు. తన పదవి ముగిసిన తర్వాత ఆ ఫర్నీచర్‌ను తీసుకెళ్లాలని అసెంబ్లీ కార్యదర్శికి రెండు లేఖలు రాశారు. వాటిని పక్కనపడేసి ఫర్నీచర్‌ దొంగతనం చేశారని కేసు పెట్టడం ఏమిటి? రెండు లక్షలు విలువచేసే ఫర్నీచర్‌ కోసం అంత సీనియర్‌ నేతపై కేసు పెడతారా?’..  
– రెండ్రోజులుగా చంద్రబాబు మీడియా సమావేశాల్లో వల్లెవేస్తున్న మాటలివి.

హైదరాబాద్‌ నుంచి అమరావతికి ఏపీ అసెంబ్లీని తరలించేటప్పుడు హైదరాబాద్‌లో ఉన్న ఫర్నీచర్‌ను భద్రత కోసం మా ఇంటికి తీసుకెళ్లాం. అమరావతిలో నిరి్మంచిన అసెంబ్లీలో కొత్త ఫరి్నచర్‌ ఏర్పాటుచేశామని సీఆర్‌డీఏ అధికారులు చెప్పడంతో అక్కడ ఆ ఫర్నిచర్‌కు భద్రత ఉండదని మా ఇంటికి తీసుకెళ్లాం. నా టర్మ్‌ పూర్తయ్యాక దాన్ని తీసుకెళ్లాలని లేకపోతే దాని విలువ ఎంతో చెబితే చెల్లిస్తానని అసెంబ్లీ కార్యదర్శికి లేఖ రాశాను.  
– ఆగస్టు 20న నరసరావుపేటలో మీడియాతో కోడెల శివప్రసాదరావు  

సాక్షి, అమరావతి: మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు అసెంబ్లీ ఫరి్నచర్‌ను తన ఇళ్లు, కార్యాలయాలకు తరలించిన విషయాన్ని చంద్రబాబు పూర్తిగా వక్రీకరిస్తూ పచ్చి అబద్ధాలు చెబుతుండడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. హైదరాబాద్‌ అసెంబ్లీ నుంచి కోడెల తన ఇళ్లు, కార్యాలయాలకు తరలించిన ఫరి్నచర్‌ అసెంబ్లీకి సంబంధించినది కాగా.. చంద్రబాబు దాన్ని కోడెల క్యాంపు కార్యాలయం ఫర్నీచర్‌గా చెబుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. అసెంబ్లీలో వినియోగించే ఫర్నీచర్‌, స్పీకర్‌ క్యాంపు కార్యాలయం కోసం వినియోగించే ఫర్నీచర్‌కు మధ్య తేడాను ప్రజలు గమనించలేరనే భావనతో ఆయన పూర్తిగా పక్కదారి పట్టించేలా మాట్లాడుతుండడంపై టీడీపీ నాయకుల్లోనే అసహనం కనిపిస్తోంది. గత నెలలో ఈ ఫర్నిచర్‌ గురించి కోడెల స్వయంగా మీడియా సమావేశం పెట్టి వెలగపూడి అసెంబ్లీలో భద్రత ఉండదని తన ఇంటికి తీసుకెళ్లినట్లు స్పష్టంచేసినప్పటికీ చంద్రబాబు వితండవాదం చేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నిజానికి నాలుగేళ్ల క్రితం ఈ ఫరి్నచర్‌ను తరలించిన కోడెల దాన్ని గుంటూరులోని తన కుమారుడి హీరో షోరూంలో వినియోగించారు.

స్పీకర్‌గా కోడెల పదవీకాలం పూర్తయిన తర్వాత కొత్తగా బాధ్యతలు చేపట్టిన అసెంబ్లీ కార్యదర్శి ఫర్నీచర్‌ గురించి వివరాలు సేకరిస్తున్న సమయంలో హైదరాబాద్‌ అసెంబ్లీలో ఉండాల్సిన ఫర్నీచర్‌ మాయమైన విషయం బయటపడింది. దీనిపై అసెంబ్లీలో అంతర్గతంగా విచారణ జరుగుతున్న విషయం తెలిసి కోడెల హడావుడిగా మీడియా సమావేశం పెట్టి అది తన వద్ద ఉందని తెలిపారు. ఆగస్టు 27న అసెంబ్లీకి కార్యదర్శికి ఒక లేఖ పాత తేదీతో పంపించి ముందే తాను ఇచి్చనట్లు చెప్పుకునే ప్రయత్నం చేశారు. కానీ, అప్పటికే ఈ విషయంపై గుంటూరు జిల్లా పోలీసులు, అసెంబ్లీ యంత్రాంగం పూర్తిస్థాయి విచారణ జరిపింది.  ఏపీ అసెంబ్లీని అమరావతికి మార్చిన సమయంలో అక్కడి ఫర్నీచర్‌ను కోడెల సత్తెనపల్లి, నర్సరావుపేటలోని తన ఇళ్లు, వ్యాపార సంస్థలకు తరలించారు. ఇందుకు అప్పటి అసెంబ్లీ చీఫ్‌ మార్షల్‌ గణేష్‌ సహకరించినట్టు తేలడంతో ఇటీవలే ఆయన్ని ఆ పోస్టు నుంచి తప్పించారు.

మాయమైన ఫర్నీచర్‌ ఇదే..  
బర్మా టేకుతో చేయించిన నిజాం కాలం నాటి టేబుళ్లు, డిజైనర్‌ కురీ్చలు, సోఫాలు తరలించారు. నెమలి ఆకారంలోని 14 సందర్శకుల కురీ్చలు, ఒక సెంటర్‌ టేబుల్, ఐదు కురీ్చలు, 27 ప్లాస్టిక్‌ కురీ్చలు, సభ్యుల లాంజిలోని 80 తెల్ల కురీ్చలు, స్పీకర్‌ యాంటి రూమ్‌లోని మూడు కుర్చీలు, మూడు సింగిల్‌ సీటర్‌ సోఫాలు, ఒక త్రీ సీటర్‌ సోఫా, పది చెక్క కుర్చీలు, రెండు స్లి్పట్‌ ఏసీలు, ఎగ్జిక్యూటివ్‌ కురీ్చలు, సందర్శకుల కురీ్చలు, బీఏసీ మీటింగ్‌ హాలులోని టేబుల్, ఎగ్జిక్యూటివ్, సాధారణ కురీ్చలు, డైనింగ్‌ హాలులోని టేబుల్, కురీ్చలు, కప్‌బోర్డు తదితర వస్తువులు తరలించారు. ఇవికాక.. స్పీకర్‌ ఛాంబర్, ఇతర ప్రదేశాల్లో ఉన్న ఫరి్నచర్, టవర్‌ ఏసీలు, కంప్యూటరు సైతం మాయమయ్యాయి. ఇవన్నీ కోడెల క్యాంపు కార్యాలయం కోసం వాడినవని చంద్రబాబు అబద్ధాలు ఆడుతున్నారు. వీటి విలువ కూడా తక్కువ చేసి చూపిస్తుండడం గమనార్హం.   

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా