అఖిల, సుబ్బారెడ్డిలతో విడివిడిగా మంతనాలు

17 Jun, 2017 21:37 IST|Sakshi
అఖిల, సుబ్బారెడ్డిలతో విడివిడిగా మంతనాలు

అమరావతి: కర్నూలు జిల్లాకు చెందిన టీడీపీ నేతలతో పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం భేటీ అయ్యారు. జిల్లాకు చెందిన మంత్రి భూమా అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డిలతో విడివిడిగా చంద్రబాబు విడివిడిగా చర్చించారు. వీరితో సమావేశం కొనసాగుతోంది. మరోవైపు పార్టీ  జిల్లా అధ్యక్షునిగా సోమిశెట్టి వెంకటేశ్వర్లు పేరు దాదాపు ఖరారయింది. కాగా, జిల్లా నేతలతో జరిపిన సమావేశంలో ప్రధానంగా ఇన్‌పుట్ సబ్సిడీ, పంటల బీమాపై చర్చ జరిగింది.

ఏడు జిల్లాల పరిధిలో రూ.1680 కోట్లతో ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించారు. ఇందులో సగానికి పైగా నిధులను రాష్ట్ర ప్రభుత్వం భరించనున్నదని సీఎం తెలిపారు. ఒక్క అనంత జిల్లాకే రూ.1032 కోట్ల మేర ఇన్‌పుట్ సబ్సిడీ ఇస్తామని, కర్నూలు జిల్లాకు రూ.325 కోట్లు, చిత్తూరుకు రూ.163 కోట్లు, కడపకు రూ.77 కోట్లు, ప్రకాశం జిల్లాకు రూ.72 కోట్లు, శ్రీకాకుళంజిల్లాకు రూ.6.55 కోట్లు, నెల్లూరుకు రూ.3.81 కోట్ల మేర ఇన్ పుట్ సబ్సిడీ ఇవ్వనున్నట్లు ఆయన వివరించారు. పంటల బీమా కింద రూ.534 కోట్లు ఇవ్వాలని కూడా నిర్ణయించారు.

మరిన్ని వార్తలు