మెగా సిటీగా విశాఖ, తూర్పులో పెట్రోలియం వర్శిటీ

4 Sep, 2014 12:50 IST|Sakshi

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాజధానిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొన్ని ప్రతిపాదనలు చేశారు. అన్ని జిల్లాల్లో  అభివృద్ధి జరగాలన్న నేపథ్యంలో ఇరవై పేజీల ప్రకటనను విడుదల చేశారు. ప్రతిపాదనల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

శ్రీకాకుళం జిల్లా

నూతన పారిశ్రామిక నగరంగా శ్రీకాకుళం
శ్రీకాకుళం జిల్లా భావనపాడులో పోర్టు
కళింగపట్నం పోర్ట్ అభివృద్ధి
స్మార్ట్ సిటీగా శ్రీకాకుళం, నూతన విమానాశ్రయం, ఫుడ్ పార్క్
వంశధార, నాగావళిపై ఉన్న ప్రాజెక్టుల నిర్మాణం
శ్రీకాకుళానికి ఓపెన్ యూనివర్సిటీ, ఎలక్టానిక్స్, హార్డ్వేర్ పార్క్

విజయనగరం

విజయనగరంలో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మాణం
నూతన పారిశ్రామిక నగరంగా విజయనగరం
ఏడాదిలోగా తోటపల్లి రిజర్వాయర్ పూర్తి
విజయనగరానికి పుడ్ పార్క్, గిరిజన యూనివర్శిటీ
హార్డ్వేర్ పార్క్, పోర్టు, సంగీతం, లలిత కళల అకాడెమీ, మెడికల్ కళాశాల

విశాఖ
మెగా సిటీగా విశాఖ
విశాఖలో అంతర్జాతీయ విమానాశ్రయం
విశాఖలో ఇండస్ట్రీయల్ కారిడార్, మెట్రోరైలు
విశాఖలో ఐఐఎం, ఐఐఎఫ్టీ, మెగా ఐటీ హబ్, ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల కేంద్రం
విశాఖలో ఇన్నోవేషన్, ఇంక్యుబేషన్ హబ్, పుడ్ పార్క్
విశాఖలో ఎగ్జిబిషన్, కన్వెన్షన్ సెంటర్, రైల్వే జోన్

తూర్పు గోదావరి జిల్లా

తూర్పు గోదావరి జిల్లాకు పెట్రోలియం యూనివర్శిటీ
పోర్ట్, ఎలక్ట్రానిక్ హార్డ్వేర్ పార్క్, వీసీఐసీ కారిడార్
విశాఖ -చెన్నై ఇండస్ట్రీయల్ కారిడార్లోకి కాకినాడ
తెలుగు యూనివర్శిటీ
కొబ్బరిపీచు ఆధారిత పారిశ్రామిక కాంప్లెక్స్
స్మార్ట్ సిటీస్గా రాజమండ్రి, కాకినాడ
ఫుడ్ పార్క్
టూరిజం, భూఉపరితల జలమార్గం
కాకినాడలో ఎస్ఎన్జీ టెర్మినల్
తునిలో నౌక నిర్మాణ కేంద్రం
ఆక్వా కల్చర్, ప్రాసెసింగ్ యూనిట్
ఐటీ హబ్గా రాజమండ్రి

పశ్చిమ గోదావరి జిల్లా


నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ
ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అండ్ క్రాప్ట్స్
నరసాపురం పోర్టు
తాడేపల్లిగూడెంలో ఎయిర్పోర్టు
సిరామిక్ పరిశ్రమ
ఆయిల్ పామ్ పరిశ్రమ
పర్యాటక కేంద్రంగా కొల్లేరు
జలమార్గాల అభివృద్ధి
చింతలపూడి ప్రాంతంలో బొగ్గు వెలికితీత
పోలవరం ప్రాజెక్టు
కొబ్బరిపీచు ఆధారిత పరిశ్రమలు
మెట్ట ప్రాంతాల్లో 100 శాతం డ్రిప్ ఇరిగేషన్
ఆక్వా కల్చర్, ప్రాసెసింగ్ యూనిట్స్
ఉద్యానవన పరిశోధన కేంద్రం

మరిన్ని వార్తలు