చంద్ర డాబు

15 Jul, 2019 13:20 IST|Sakshi
బ్యాంకులో రుణాలు తీసుకోవడానికి వచ్చిన రైతులు

చెప్పేవన్నీ అబద్ధాలు

అన్నదాతను ఆదుకోకుండా నిర్లక్ష్యం చేసిన నాటి సీఎం  

నాలుగేళ్లుగా వడ్డీలేని రుణరాయితీ ఇవ్వని టీడీపీ ప్రభుత్వం

అప్పుల్లో కూరుకుపోయిన రైతులు

‘‘మా ప్రభుత్వంలో 2014 నుంచి 2018 వరకునాలుగేళ్ల పాటు రైతులు తీసుకునే పంట రుణాలకుసున్నా వడ్డీ (వడ్డీలేని రుణాలు), పావలావడ్డీరుణాలను ఇచ్చామని నాటి సీఎం,ప్రస్తుత ప్రతిపక్ష నాయకుడు
చంద్రబాబునాయుడు శాసనసభలో అబద్ధాలు చెప్పారనిరైతుసంఘాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. వడ్డీ రాయితీనికాగితాల్లో చూపించారని, క్షేత్రస్థాయిలోఇప్పటికీ ఒక్క రూపాయి వచ్చి ఉంటేఒట్టని అంటున్నారు. నోరు తెరిస్తే అబద్ధాలుచెప్పడం చంద్రబాబుకు వెన్నతో పెట్టినవిద్య అని సన్న, చిన్నకారు రైతులు నిప్పులుచెరుగుతున్నారు. టీవీల్లో శాసనసభ ప్రత్యక్షప్రసారాలను చూస్తున్నారే జ్ఞానం కూడా లేకుండా
ఇష్టమొచ్చినట్లు రైతులకు చేసిన మోసాలను చెప్పడంఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని అంటున్నారు.’’

కడప అగ్రికల్చర్‌ : అతివృష్టి, అనావృష్టి విజృంభిస్తున్న చీడపీడలు, ఎరువులు, విత్తనాల ధరలు, పురుగుమందుల ధరలు, పెట్టుబడి ఖర్చులు పెరుగుతున్నా.. ఆశించిన దిగుబడులు సక్రమంగా రాక రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రకృతి సహకరించక రైతులు నాలుగేళ్లుగా తీవ్రనష్టాలను చవిచూశారు. పెట్టుబడుల కోసం పంట రుణాలు సమకూర్చడానికి, వడ్డీ రాయితీ కింద ఇవ్వాల్సిన  బకాయి ఇవ్వకుండా నాటి టీడీపీ ప్రభుత్వం మభ్యపెట్టిందని రైతులు, రైతు సంఘాల నాయకులు దుమ్మెత్తి పోస్తున్నారు.పంటలసాగుకు వడ్డీలేని రుణాలు ఇస్తున్నామని నాటి సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి చంద్రమోహన్‌రెడ్డి పదే పదే చెబుతూవచ్చారు. దీంతో రైతులు సంతోషించారు.పంటరుణాలు తెచ్చుకున్నారు. అయితే ఎక్కువ రోజులు వారి ఆనందం నిలవలేదు. రైతులకు బ్యాంకర్లు షాక్‌ ఇస్తున్నారు. గతంలో పంటల సాగుకు తీసుకున్న రుణాలు వడ్డీతో సహా చెల్లించాలని తేల్చి చెబుతుండడంతో ఆందోళన చెందుతున్నారు.

రూ.లక్షలోపు రుణాలు తీసుకునేరైతులు 3.67 లక్షల మంది
జిల్లాలో 1 హెక్టారులోపు భూమి ఉన్న రైతులు 2,41,802 మంది, 2 హెక్టార్లలోపు ఉన్నవారు 1,41,853 మంది, 5 హెక్టార్ల లోపు ఉన్న వారు 73,084 మంది, 5 హెక్టార్ల పైబడి10,854 మందిఉన్నారు. కౌలుకు రుణాలు తీసుకుని పంటలు సాగు చేసుకునే రైతులు 22 వేల మంది ఉన్నారనేది అధికారిక రికార్డులు తెలుపుతున్నాయి. జిల్లాలో మొత్తం వ్యవసాయ యోగ్యమైన భూమి 14,35,864.2 ఎకరాలు ఉంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం లక్షలోపు రుణాలు తీసుకునే రైతులకు వడ్డీలేని రుణాలు, ఆపై రుణాలు తీసుకునే వారికి పావలా వడ్డీ ఇస్తామని చెప్పారు. రూ.లక్షలోపు రుణాలు తీసుకున్న రైతులు జిల్లాలో 3.45 లక్షల మంది ఉన్నారు. రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు రుణాలు తీసుకునే వారు 78 వేల మంది.. కౌలు రుణాలు తీసుకునే రైతులు 22 వేల మంది ఉన్నారు. వారందరు బ్యాంకుల్లో రుణాలు తీసుకున్నారు. రుణాలు తీసుకున్న ఏడాది గడువులోపు తిరిగి చెల్లిస్తే వడ్డీ కట్టనక్కరలేదని ఆశించిన రైతులు బ్యాంకులకు వెళ్లారు. తీరా అక్కడికి వెళ్లాక వడ్డీని ఇప్పుడు చెల్లించండి.. తరువాత ప్రభుత్వం ఇచ్చినపుడు వడ్డీమొత్తం తిరిగి మీ ఖాతాలకు జమ చేస్తామనడంతో రైతులు ఎంతో సంతోషించారు. కానీ ఇంతవరకు ఆ వడ్డీ రుణ బకాయిని నాటి ప్రభుత్వం చెల్లించకపోవడంతో ఆందోళన చెందుతున్నారు.

వడ్డీ లేని రుణ రాయితీ బకాయి రూ.445 కోట్లు
ఏడాది లోపు బ్యాంకుల నుంచి తీసుకున్న పంట రుణాలు తిరిగి చెల్లిస్తే ఆయా రైతులకు వడ్డీ మినహాయింపు ఇస్తారు. కానీ నాటి టీడీపీ ప్రభుత్వ తీరు వల్ల నాలుగేళ్లుగా వడ్డీ రాయితీ అందలేదు. తాము మాత్రం రైతులకు ఎలాంటి బకాయిలు లేమని నాటి వ్యవసాయశాఖ, జిల్లా ఇన్‌చార్జి మంత్రి చంద్రమోహన్‌రెడ్డి జిల్లాకు వచ్చిన ప్రతిసారీ చెబుతువచ్చారు. క్షేత్రస్థాయిలో అన్నదాతలను కదిలిస్తే ఎక్కడి వడ్డీ రా యితీ ఇస్తున్నారని టీడీపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్య క్తం చేస్తున్నారు. కరువుతో పంటలు పండక అసలు రుణం ఎలా కట్టాలో దిక్కుతోచకుంటే మళ్లీ ఇప్పుడు వడ్డీ చెల్లించాలని బ్యాంకర్లు అంటున్నారని రైతులు మదనపడుతున్నారు. వడ్డీ రాయితీ కింద 2014లో రూ.105 కోట్లు, 2015లో రూ.107 కోట్లు, 2016లో రూ.115 కోట్లు, 2017లో రూ.118 కోట్లు రైతులకు ఇవ్వాల్సి ఉంది. జిల్లాకు నాలుగేళ్లుగా వడ్డీ లేని రుణం తీసుకున్న వారికి రూ.445 కోట్లు రాయితీ కింద చెల్లించాల్సి ఉంది. ఈ విషయం బ్యాంకర్లు కూడా స్పష్టం చేస్తున్నారు. వడ్డీ రాయితీ ఇవ్వకపోతే ఎలా అని అటు బ్యాంకు అధికారులను, ఇటు నాటి ప్రభుత్వాన్ని రైతులు నిందిస్తున్నారు. ఈ విషయంపై నాలుగేళ్లుగా నాటి ప్రభుత్వం చెల్లించలేకపోయామని చంద్రబాబునాయుడు తప్పును ఒప్పుకోవాలని రైతు సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

వడ్డీ రాయితీ ఇవ్వలేదు
బ్యాంకులో పంట రుణాలు తీసుకుని సంవత్సరంలోపు తిరిగి చెల్లిస్తే వడ్డీ లేని రుణం కింద గుర్తిస్తారు. ఆ రుణాలకు రైతులు వడ్డీ చెల్లించాల్సి ఉండదు. అయితే నాలుగు సంవత్సరాలుగా వడ్డీ రాయితీ ఇవ్వలేదు. కరువుతో అల్లాడుతున్న రైతులను ఆదుకోవడంలో నాటి ప్రభుత్వం విఫలమైంది.        –చలపతి, యువరైతు, వేముల, వేముల మండలం.

కరువు రైతును విస్మరించిన టీడీపీ ప్రభుత్వం
కరువుతో అల్లాడిపోయాం. టీడీపీ ప్రభుత్వం రైతులకు వడ్డీలేని రుణానికి సంబంధించి రాయితీ ఇవ్వకుండా మభ్యపెట్టింది. ఆదుకోవాల్సిందిపోయి ఇబ్బంది పెట్టింది. ఇలా చేస్తే రైతులు ఎలా పంటలు సాగు చేసుకుంటారు. పంటల కోసం తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించడానికి తంటాలు పడుతున్నారు. కరువు రైతును టీడీపీప్రభుత్వం విస్మరించింది.–శ్రీనివాసులరెడ్డి, రైతు, వి.కొత్తపల్లె, వేముల మండలం.

వడ్డీరాయితీ ఇవ్వకపోవడంవల్లే....
జిల్లాకు వడ్డీలేని రుణ రాయితీ కింద రూ.445 కోట్లు రావాల్సి ఉంది. కరువుతో రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న మాట వాస్తమే. వారిని ఆదుకోవాల్సిందే. రుణం తీసుకున్న రైతులకు రుణ రాయితీ ఇవ్వాలనే బ్యాంకు నిబంధనలు ఉన్నాయి. నాటి ప్రభుత్వం వడ్డీ రాయితీ ఇవ్వకపోవడం వల్లనే రైతుల ఖాతాలకు సొమ్ములు చేరలేదు.–ఆంజనేయాచారి, జిల్లా లీడ్‌ బ్యాంకు చీఫ్‌ మేనేజర్, కడప.

సాగుకు యోగ్యమైన భూమి:     14,35,864.2 ఎకరాలు
జిల్లాలోని రైతులు:     4,89,593 మంది
బ్యాంకుల నుంచి రుణాలు తీసుకునే వారు :     4.45 లక్షల మంది
రూ.లక్షలోపు రుణం తీసుకునే వారు:     3.67 లక్షల మంది.
జిల్లాకు నాలుగేళ్లుగా రావాల్సిన వడ్డీ రాయితీ : రూ.445 కోట్లు

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘ఆయనలా దొడ్డిదారిన రాజకీయాల్లోకి రాలేదు’

కోర్కెలు తీర్చే దేవుడు జగనన్న : జనసేన ఎమ్మెల్యే

ముఖ్యమంత్రి జగన్‌ను కలిసిన ద్రోణంరాజు

‘ఆ 26 భవనాలకు నోటీసులు ఇచ్చాం’

కొత్త గవర్నర్‌కు సీఎం జగన్‌ ఫోన్‌

టీడీపీ సభ్యులకు సీఎం జగన్‌ సూచన..!

ఎత్తిపోతలు మొదలైనా చేరని పుష్కర జలాలు

ఖాకీ వేషంలో ఉన్న దొంగల అరెస్టు

టీడీపీ సభ్యుల తీరుపై భగ్గుమన్న స్పీకర్‌..!

ధన్యవాదాలు సీఎం సార్‌

యురేనియం బాధితులకు ఊరట

సీఎం వైఎస్‌ జగన్‌ ఫొటో పెట్టేందుకు నిరాకరణ!

హోదా కోసం కదం తొక్కిన యువత

వలలో వరాల మూట

‘5 కోట్ల పనిని 137 కోట్లకు పెంచారు’

తప్పిన ప్రమాదం; విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్‌..!

బాలశాస్త్రవేత్తలకు రాష్ట్రపతి భవన్‌ ఆహ్వానం

ప్రభుత్వ శాఖలే శాపం

'ఉదయ్‌'రాగం వినిపించబోతుంది

ఒంటరిగా వెళుతున్న మహిళలే లక్ష్యంగా..

మోసం.. ఆపై ఆత్మహత్యాయత్నం.!

క్యాంపస్‌ ఉద్యోగాల పేరిట పని చేయించుకొని..

మహిళల రక్షణకు అత్యంత ప్రాధాన్యం

అమర్‌ ప్రసంగం అదుర్స్‌

గంగవరంలో చిరుత సంచారం?

జగన్ సీఎం అయ్యాడని శ్రీశైలానికి పాదయాత్ర

విలాసాలకు కేరాఫ్‌ ప్రభుత్వ కార్యాలయాలు

నారికేళం...గం‘ధర’ గోళం

మార్పునకు కట్టు'బడి'..

మోడీ పథకాలకు చంద్రబాబు పేరు పెట్టుకున్నారు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

తమన్నా ప్లేస్‌లో అవికానా!

‘పూరి ముఖంలో సక్సెస్‌ కనిపించింది’

బిజీ అవుతోన్న ‘ఏజెంట్‌’

అమ్మదగ్గర కొన్ని యాక్టింగ్‌ స్కిల్స్ తీసుకున్నాను..

నాన్నా.. బయటకు వెళ్లు అన్నాడు!

ఇప్పుడు ‘గ్యాంగ్‌ లీడర్’ పరిస్థితేంటి?