రుణమాఫీ అమలు చేయాలని రైతుల ధర్నా

14 Sep, 2014 01:49 IST|Sakshi

ఎ.వేమవరం (ఆచంట): రైతు, డ్వాక్రారుణాల మాఫీలో ప్రభుత్వం తాత్సారం చేయకుండా వెంటనే రద్దు చేయాలని సీపీఎం మండల కార్యదర్శి గెద్దాడ వెంకటేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివార ం ఆచంట వేమవరం సొసైటీ వద్ద రుణాలు రద్దు చేయాలని కోరుతూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా గెద్దాడ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రైతు, డ్వాక్రా రుణాలు మాఫీ చేయడంతో ప్రభుత్వం తాత్సారం చేయడం సిగ్గుచేటన్నారు. రుణాల రద్దు సకాలంలో జరగకపోవడంతో వడ్డీలు పెరిగిపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కౌలు రైతులకు బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు జారీచేస్తున్న ప్రభుత్వం రుణాలు ఇవ్వడంతో శ్రద్ధ చూపడంలేదని వెంకటేశ్వరరావు ఆరోపించారు. ఈసందర్భంగా సొసైటీ కార్యదర్శి ఆరుమిల్లి వెంకటేశ్వరరాకు వినతి పత్రం అందించారు. ధర్నాలో సీపీఎం నాయకులు జక్కంశెట్టి శ్రీనివాసు, కాండ్రేకుల వెంకటేశ్వరరావు, మన్నె వెంకటేశ్వరరావు, నేతల సంజీవరావు తదితరులు పాల్గొన్నారు.
 

>
మరిన్ని వార్తలు