మద్యాన్ని నిషేధించలేం... నియంత్రిస్తాం

14 Nov, 2014 09:31 IST|Sakshi
మద్యాన్ని నిషేధించలేం... నియంత్రిస్తాం

సింగపూర్: 2022 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలో టాప్ 3 రాష్ట్రాలలో ఒకటిగా తీర్చిదిద్దుతామని ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. శుక్రవారం సింగపూర్లో స్థానిక పారిశ్రామికవేత్తలతో బాబు సమావేశమైయ్యారు. ఈ సందర్భంగా పారిశ్రామికవేత్తలు వేసిన ప్రశ్నలకు బాబు సమాధాన మిచ్చారు. ఆ ప్రశ్న జవాబుల పరంపర ఇలా కొనసాగింది. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం ఇచ్చే ప్రాధాన్యత ఏమిటో వివరించాలని పారిశ్రామికవేత్తలు బాబును కోరారు. కంపెనీలు స్థాపించేవారికి వేగంగా అనుమతులు మంజురు చేస్తామని బాబు సమాధానమిచ్చారు.

ఏపీ ప్రభుత్వం ఒక్క రాజధానిపైనే ఎందుకు దృష్టి సారించింది? గతంలో జరిగిన నష్టమే మళ్లీ జరుగుతుందని మరో పారిశ్రామికవేత్త అనుమానం వ్యక్తం చేశారు. ఆ ప్రశ్నకు బాబు సమాధానమిస్తూ... విశాఖ, తిరుపతి నగరాలతో సహా 14 స్మార్ట్ సిటీలను నిర్మిస్తామని చంద్రబాబు వారికి వివరించారు. గుజరాత్ రాష్ట్రం మద్యాన్ని పూర్తిగా నిషేధించింది... కేరళ కూడా ఆ దిశగా ఆలోచిస్తుంది... మరీ మీరెందుకు మద్యాన్ని నిషేధించరని చంద్రబాబును మరో పారిశ్రామికవేత్త ప్రశ్నించారు. అందుకు చంద్రబాబు మాట్లాడుతూ... మద్యాన్ని మాత్రం నిషేధించలేం కాని... నియంత్రిస్తామని చంద్రబాబు పారిశ్రామిక వేత్తలకు వెల్లడించారు.

మరిన్ని వార్తలు