'30 ఏళ్లుగా హైదరాబాద్ లో ఉంటున్నా'

5 Oct, 2014 16:53 IST|Sakshi
'30 ఏళ్లుగా హైదరాబాద్ లో ఉంటున్నా'

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలు కలిసిమెలసి ఉండాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. భౌగోళికంగా విడిపోయినా తెలుగువారంతా మానసికంగా ఒక్కటిగానే ఉండాలని కోరుకున్నారు. భాష, ప్రాంతం, దేశం మన అనుబంధాన్ని పెంచుతాయని అన్నారు.

30 ఏళ్లుగా హైదరాబాద్ లో ఉంటున్నానని, రేపటిరోజు కూడా ఉంటా అని చెప్పారు. ఒకరికొకరు సహరించుకుంటూ ముందుకెళ్లాలన్నారు. బీజేపీ ఎంపీ బండారు దత్తాత్రేయ ఆదివారం నిర్వహించిన అలయ్ బలయ్ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
 

మరిన్ని వార్తలు