గడ్కరీ ప్రశ్నలు.. చంద్రబాబు ఉక్కిరిబిక్కిరి..

11 Jul, 2018 20:27 IST|Sakshi
కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ, సీఎం చంద్రబాబు నాయుడు

సాక్షి, పోలవరం : ఇందిరాసాగర్‌ పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర జలవనరుల, రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ వేసిన ప్రశ్నలకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉక్కిరిబిక్కరి అయ్యారు. బుధవారం ప్రాజెక్టు పనులను గడ్కరీ పరిశీలించారు. అనంతరం సీఎం చంద్రబాబుతో కలసి మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు దేశానికి తలమానికమైనదని అన్నారు. అయితే, ప్రాజెక్టుకు సంబంధించి కొన్ని సమస్యలు ఉన్నమాట వాస్తవమని చెప్పారు. వాటిని చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నామని వివరించారు.

ప్రాజెక్టు నిర్మాణ వ్యయం పెంపుపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అనుమతి తీసుకోవాలని తేల్చి చెప్పారు. హఠాత్తుగా నిర్మాణ వ్యయం ఎందుకు పెరిగిందో చెప్పాలని సీఎం చంద్రబాబును గడ్కరీ అధికారుల సమక్షంలోనే నిలదీశారు. నవ్వుతూ మాట్లాడుతూనే ప్రాజెక్టు అంచనా వ్యయాలను అంతకంతకు పెంచడంపై రాష్ట్ర ప్రభుత్వానికి చురకలంటించారు.

ప్రాజెక్టుపై పాత డీపీఆర్‌కు ప్రస్తుత డీపీఆర్‌కు అసలు పోలికే లేదని, ఎందుకు మార్చారో కచ్చితంగా వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగారు. భూ సేకరణను గతంలో కంటే ఎక్కువగా చేశారని, పెరిగితే నిర్వాసితులకు చెల్లించాల్సిన పరిహారం పెరగాలి కానీ భూ సేకరణ ఎందుకని ప్రశ్నించారు. గడ్కరీ ప్రశ్నలపై చంద్రబాబు వివరణ ఇచ్చినా ఆయన సంతృప్తి చెందలేదు. దీంతో ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలతో ఢిల్లీకి వచ్చి అక్కడే మూడు రోజులు పాటు ఉండాలని గడ్కరీ చంద్రబాబుకు సూచించారు.

జల వనరుల శాఖకు ప్రాజెక్టుపై అవసరమైన వివరాలన్నీ సమర్పించాలని చెప్పారు. ఆ తర్వాత ఎనిమిది రోజుల్లో అన్ని క్లియరెన్సులు ఇచ్చి నిధుల పెంపు కోసం ఆర్థిక శాఖకు ఫైల్‌ పంపుతానని పేర్కొన్నారు. ప్రాజెక్టుకు ఎంత ఖర్చైనా కేంద్ర ప్రభుత్వం భరించడానికి సిద్ధంగా ఉందని వెల్లడించారు. నిధుల గురించి బెంగపడాల్సిన పని లేదని అన్నారు. అభివృద్ధి, రాజకీయం రెండు వేర్వేరని వ్యాఖ్యానించారు. రాజకీయంగా తేడాలుంటే వీధుల్లో పోరాడతామని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు వల్ల రైతులకు ఎంత మేలు జరుగుతుందో నాకు బాగా తెలుసని అన్నారు. అందుకే ప్రాజెక్టు నిర్మాణానికి చాలా ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు.

సవరించిన అంచనాలు రూ. 57, 940 కోట్లు..
సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ప్రాజెక్టు సవరించిన అంచనాలు రూ. 57, 940 కోట్లని పేర్కొన్నారు. ఇందులో భూ సేకరణ నిమిత్తం రూ. 33 వేల ఖర్చు అవుతుందని చెప్పారు. 2019 డిసెంబర్‌ నాటికి ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఆ విషయంలో చంద్రబాబే నెంబర్‌వన్‌: వైఎస్‌ జగన్‌

భావోద్వేగానికి లోనైన దువ్వాడ శ్రీనివాస్‌

వైఎస్‌ వరం ప్రైవేట్‌ పరం

బాబు ఓడితేనే భవిత

పవన్‌ పూటకో మాట.. రోజుకో వేషం

ఆయన చెప్పబట్టేరా పింఛన్‌ మొత్తం పెరిగింది

ఎన్నికలకు విఘాతం కలిగిస్తే ...

పల్లెల్లో దాహం కేకలు !

2 లక్షల 30 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తాం : వైఎస్‌ జగన్‌

వెంకటేశ్వర్లు హత్యకు కుట్ర.. ఇది వారి పనే!

తాడేపల్లిగూడెం గట్టు..విలక్షణంగా జై కొట్టు..

మద్యం పై యుద్ధం

భీమవరంలో పవన్‌ ఓడిపోవడం ఖాయం

పి.గన్నవరంలో టీడీపీకి భారీ షాక్‌..!

ఉన్నత చదువులకు ఊతం

మూడు హామీలు..ముక్కచెక్కలు

తండ్రి ఆశయాల సాధనే లక్ష్యం

బ్రహ్మాండంగా నటిస్తున్న చంద్రబాబు

వైఎస్సార్‌సీపీతోనే బీసీలు బలోపేతం

నవశకానికి నాంది

పవన్‌ ఓ మిస్టర్‌ కన్ఫ్యూజన్‌..!

పార్టీలకే పట్టం.. స్థానికులంటే ఇష్టం

ఓటు వేయాలంటే  నడక యాతనే..

మొగల్తూరుకు చిరు ఫ‍్యామిలీ చేసిందేమీ లేదు..

మాతా, శిశు సంరక్షణ కార్డులు ఎక్కడున్నాయ్‌..?

కరుణించవమ్మా మహాలక్ష్మి..

ఆశల తీరం.. అభివృద్ధికి దూరం

వెనుకబడిన వర్గాలకు వెన్నుదన్ను..

బాబూ లీకేష్‌.. అఫిడవిట్‌లో కాపీనేనా?

కళలకు ‘చంద్ర’గ్రహణం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

దేవీకి డాన్స్‌ నేర్పుతున్న సితార

ఆర్‌ఆర్‌ఆర్‌ : అల్లూరి లుక్‌ ఇదేనా!

మరణానికి దగ్గరగా వెళ్లినట్టు అనిపిస్తోంది!

విజయ్‌తో రొమాన్స్‌

చప్పక్‌ మొదలు

పాంచ్‌ పటకా