శనగ రైతులు పిచ్చోళ్లు!

8 Oct, 2014 02:20 IST|Sakshi
శనగ రైతులు పిచ్చోళ్లు!

* మూడేళ్లపాటు నిల్వలు పెట్టి.. నన్ను పిచ్చోడ్ని చేస్తారా?
* ప్రకాశం జిల్లా పర్యటనలో మండిపడ్డ ఏపీ సీఎం చంద్రబాబు
* డబ్బులేమైనా చెట్లకు కాస్తున్నాయా అంటూ ఆగ్రహం
* ఒంగోలులో వర్సిటీలు, ఎయిర్‌పోర్టులు పెడతామంటూ హామీలు
* డ్వాక్రా ఉత్పత్తుల అమ్మకానికి త్వరలో ‘ఈ-కామర్స్’ విధానం

 
 సాక్షి, ఒంగోలు, హైదరాబాద్: ‘నిజంగా ప్రకాశం జిల్లా శనగ రైతులు పిచ్చోళ్లయ్యా... ఒకటీ రెం డే ళ్లుకాదు.. మూడేళ్లపాటు సరైన ధరల్లేవని నిల్వ లు పెట్టారు. ఒకట్రెండేళ్లపాటు నష్టాలొస్తే ఆమాత్రం భరించలేరా..? ఇప్పుడేమో ప్రభుత్వం మెడపై కత్తిపెట్టినట్లు నన్ను పిచ్చోడ్ని చే యాలని చూస్తున్నారు.’’ అంటూ ఏపీ ముఖ్యమంత్రి చం ద్రబాబు మంగళవారం ప్రకాశం జిల్లా పర్యటన లో రైతులపై విరుచుకుపడ్డారు. పర్చూరు నియోజకవర్గం నాగులపాలెంలో ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమంలో రైతులు, శాస్త్రవేత్తలు, వ్యవసాయాధికారులతో ఆయన ముఖాముఖి నిర్వహిం చారు. ఈ సందర్భంగా పలువురు శనగ రైతులు మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా 17 లక్షల క్వింటా ళ్ల శనగలు కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ ఉన్నాయని, అందులో 7.5 లక్షల క్వింటాళ్లు మంచిరకం కిందకొస్తాయని చెప్పారు. సరైన గిట్టుబాటు ధర రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామన్నారు.
 
 రైతుల కోసం.. ప్రజలతో కొనిపించలేం..
 రైతుల వినతిపై చంద్రబాబు స్పందిస్తూ ‘శనగరైతులు ఏళ్లపాటు పంటను నిల్వపెట్టుకుని, ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తే మా దగ్గర డబ్బులేమైనా చెట్లకు కాస్తున్నాయా..?’ అన్నారు. జనాలు ఉచితంగా పంపిణీ చేస్తే ఏై మెనా తీసుకుంటారని, రైతుల కోసం శనగలు కొనాలని చెప్పలేం కదా..? అని ప్రశ్నించారు. ప్రస్తుతానికి శనగల రైతులకు తానేమీ న్యాయం చేయలేనని, నాఫెడ్ కూడా కొనుగోలుకు చేతులెత్తేసిందన్నారు. రుణ మాఫీ అమలుపై ప్రభుత్వం తాత్సారం చేయడంతో బ్యాంకర్లు కోల్డ్‌స్టోరేజీ ల్లోని శనగల వేలానికి దూకుడు చూపుతున్నారని రైతులు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లగా.. తక్షణమే వేలాన్ని నిలిపివేయాలని ఆదేశాలిస్తామని సమాధానమిచ్చారు. అంతకుముందు వైఆర్‌ఎస్ పాఠశాలలో ‘బడిపిలుస్తోంది’ కార్యక్రమానికి హాజరయ్యారు. రానున్న కాలంలో సోషల్ వెల్ఫే ర్ హాస్టళ్లను మూసివేసి రెసిడెన్షియల్ పాఠశాలలుగా మారుస్తామని, మండలాల్లో క్లస్టర్ పాఠశాలలు ఏర్పాటుచేసి పేదవిద్యార్థుల తరలింపునకు వాహనాల సదుపాయం కూడా పెడతామని చంద్రబాబు హామీనిచ్చారు.
 
 ఒంగోలులో వెటర్నరీ యూనివర్శిటీ..
 పర్చూరు, ఒంగోలు జన్మభూమి బహిరంగ సభ ల్లో చంద్రబాబు మాట్లాడుతూ ఒంగోలు గిత్త జా తిని కాపాడేందుకు తగిన కృషి చేస్తామని, ఇక్కడ వెటర్నరీ యూనివర్శిటీ నెలకొల్పుతామన్నారు. జిల్లాలో మైనింగ్ యూనివర్శిటీ ఏర్పాటుతో పాటు దొనకొండను పెద్ద ఇండస్ట్రియల్ హబ్‌గా తీర్చిదిద్దుతామన్నారు. ఒంగోలులో ఎయిర్‌పోర్టుతోపాటు రామాయపట్నం పోర్టు, కనిగిరిలో జాతీయ పారిశ్రామికవాడ అందుబాటులోకి తె స్తామన్నారు. వెలిగొండ, రామతీర్థం జలాశయం ప్రాజెక్ట్‌లను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెస్తామని, పోలవరం ప్రాజెక్ట్ పూర్తికి ప్రణాళిక సిద్ధమైందన్నారు. డ్వాక్రా ఉత్పత్తుల అమ్మకాల్లో ‘ఈ-కామర్స్’ విధానం అమలు చేస్తామన్నారు. కార్యక్రమాల్లో జిల్లామంత్రి శిద్దా రాఘవరావుతో పాటు పర్చూరు, ఒంగోలు ఎమ్మెల్యేలు ఏలూరి సాంబశివరావు, దామచర్ల జనార్దన్, ఎంపీ పులి వర్తి మాల్యాద్రి, కొండపి ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయస్వామి, కనిగిరి ఎమ్మెల్యే కదిరి బాబూరావు, మాజీ ఎంపీ కరణం బలరాం, నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జులు పాల్గొన్నారు.
 
 వెంటనే మాట మార్చిన సీఎం
 శనగ రైతులను ఆదుకుంటామని ఒంగోలు జన్మభూమి సభలో సీఎం చంద్రబాబు ప్రకటించారు. పర్చూరు పర్యటనలో శనగరైతులు తనకు పిచ్చి పట్టిస్తున్నారంటూ మాట్లాడిన సీఎం.. ఒంగోలు కు వచ్చేసరికి పూర్తిగా మాట మార్చారు. జిల్లాలో మూడేళ్లుగా శనగలను నిల్వ ఉంచుకొని రైతులు పడుతున్న కష్టాలు చూస్తే బాధేస్తోందని, వారిని ఆదుకుంటామని అన్నారు. క్వింటాల్ ఒక్కింటికి రూ.3,100లు చొప్పున ఎంఎస్‌పీ ధరకు శనగలను కొంటామని, మధ్యాహ్న భోజన పథకం లో, హాస్టళ్ల మెనూలో చేరుస్తామన్నారు. చౌక ధ రల దుకాణాల ద్వారా శనగలను విక్రయించి రైతుకు అండగా నిలుస్తామని అన్నారు. వేలం వేసేందుకు బ్యాంకర్లు రాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. కొన్ని శనగలను ప్రభుత్వం కొనగానే వాటికి డిమాండ్ వస్తుంద ని, దాంతో రైతుల కష్టాలు తీరతాయని వ్యాఖ్యానించారు.
 
 శనగల కొనుగోలుపై కేంద్రానికి లేఖ : సీఎం

 రాష్ట్రంలోని ఐదు జిల్లా ల్లో పేరుకుపోయిన శనగల కొనుగోలుపై కేంద్రానికి లేఖ రాయాలని అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు. శనగ రైతు లు పడుతున్న కష్టాలకు పరిష్కారం చూపాలని కోరారు. శనగ రైతులు ఎక్కువగా ఉన్న ప్రకాశం జిల్లా పర్యటనకు పోబోయే ముందు ఆయన మంగళవారమిక్కడ వ్యవసాయ, మార్కెటింగ్, ఇతర శాఖల అధికారులతో పరిస్థితిని సమీక్షించారు.

మరిన్ని వార్తలు