వేడుక.. వేదిక.. సూచిక

13 Aug, 2018 15:57 IST|Sakshi
రూట్‌ మ్యాప్‌ను వివరిస్తున్న ఎస్పీ

పంద్రాగస్టు వేడుకలకు రూట్‌మ్యాప్‌ సిద్ధం

శ్రీకాకుళం సిటీ : శ్రీకాకుళంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జరగనున్న పంద్రాగస్టు వేడుకలకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఓ వైపు వాన పడుతున్నా, అధికారులు మాత్రం తమ పనుల్లో తలమునకలై కనిపిస్తున్నారు. వేడుకల సందర్భంగా పట్టణంలో క్రమబద్ధీకరిస్తున్న ట్రాఫిక్‌కు ప్రజలు సహకరించాలని ఎస్పీ సీఎం త్రివిక్రమవర్మ కోరారు. ఆదివారం సాయంత్రం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరంలో ట్రాఫిక్‌ మార్పులు, పంద్రాగస్టు వేడుకల్లో పార్కింగ్, ముఖ్యమంత్రి పర్యటన వివరాలను ఎస్పీ వెల్లడించారు.

ముఖ్యమంత్రి పర్యటన ఇలా...
ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌ నుంచి 80 అడుగుల రోడ్డు మీదుగా అరసవల్లి రోడ్డు, పొట్టి శ్రీరాములు జంక్షన్, కళింగపట్నం రోడ్, ఏడు రోడ్ల కూడలి, పాలకొండ రోడ్, డేఅండ్‌ నైట్‌ జంక్షన్, అంబేడ్కర్‌ జంక్షన్‌ మీదుగా ఆర్ట్స్‌ కళాశాల మైదానం నుంచి సిల్వర్‌ జూబ్లీ ఆడిటోరియం మీదుగా ముఖ్యమంత్రి వేదిక మీదకు వెళ్తారని తెలిపారు. మీడియాకు నేరుగా ఆర్ట్స్‌ కళాశాల మైదానం నుంచే అనుమతి ఉంటుందన్నారు. ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌ నుంచి ఎవ్వరికీ అనుమతి లేదన్నారు. పంద్రాగస్టు వేడుకల అనంతరం నిర్దేశించిన బస్సులో వేదిక ప్రాంగణం నుంచి ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌కు ముఖ్యమంత్రి చేరుకుని తిరుగుపయనమవుతారన్నారు.

  • 13వ తేదీ నుంచి 15వ తేదీ సాయంత్రం వరకు పట్టణంలోకి భారీ వాహనాలు, అనుమతి లేని వాహనాలు, పట్టణ పరిధిలో లేని ఆటోలను అనుమతించేది లేదని ఎస్పీ స్పష్టం చేశారు.
  • ఏ–1 కేటగిరీ వాహనాలను ప్రభుత్వ డిగ్రీ కళాశాల రోడ్డుకు ఎదురుగా బిషప్‌ హౌస్‌ వద్ద ఉంచేందుకు ఏర్పాట్లు చేశామన్నారు.
  • పబ్లిక్‌ పార్కింగ్‌కు గాను హడ్కో కాలనీ లైబ్రరీ గ్రౌండ్, హడ్కో కాలనీ మున్సిపల్‌ హైస్కూల్‌ గ్రౌండ్స్‌లో వాహనాలను నిలుపుకోవచ్చు.
  • ఏ–2, ఏ–3, బి–1, బి–2 కేటగిరీలైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు/వివిధ శాఖల అధిపతులు/ అధికారులకు రిమ్స్‌ కాలేజీ, సెం ట్రల్‌ డ్రగ్‌ స్టోరు ముందు, నర్సింగ్‌ హాస్టల్‌ పక్కన పార్కింగ్‌ను కేటాయించారు.
  • ఆర్టీసీ డిపో–1లో పారెడీ స్కూల్‌ బస్సులు/ ద్విచక్ర, త్రిచక్రవాహనాలను నిలుపుకునేందుకు గాను పార్కింగ్‌ కేటాయించారు.
  • కోడి రామ్మూర్తి స్టేడియంలో ద్విచక్ర, త్రిచక్ర, నాలుగుచక్రాలు, ఏపీఎస్పీ వాహనాలు నిలుపేందుకు పార్కింగ్‌ను కేటాయించారు.

వేడుకలను వీక్షించే వారికి రూట్‌ ఇలా...

  • గార, శ్రీకూర్మం, అరసవల్లి, మహాలక్ష్మినగర్‌ కాల నీ, మండల వీధి, న్యూకాలనీ, చౌక్‌బజార్‌ పరిసర ప్రాంతాల ప్రజలు అరసవల్లి మిల్లు జంక్షన్, ప్రభుత్వ మహిళా కళాశాల మీదుగా సూర్యమహల్, జీటీరోడ్, ఎస్‌బీఐ జంక్షన్‌ నుంచి కుడివైపు తిరిగి చౌకబజార్‌ మీదుగా రైతుబజార్‌కు లేదా సూర్యమహల్, రామలక్ష్మణ జంక్షన్‌ మీదుగా రైతుబజార్‌కు చేరుకుని ఏఎస్‌ఎన్‌ కాలనీ మీదుగా సురక్ష ఆస్పత్రి గుండా ఆర్టీసీ కాంప్లెక్స్‌ నుంచి ప్రభుత్వ ఆర్ట్స్‌ కాలేజీకి చేరుకోవచ్చని తెలిపారు.
  •  గుజరాతీపేట, పీఎన్‌కాలనీ వైపు నుంచి వచ్చే వీక్షకుల వాహనాలను కొత్త బ్రిడ్జి రోడ్డు గుండా వచ్చి సిందూర ఆస్పత్రి పక్క నుంచి కోడి రామ్మూర్తి స్టేడియం వద్ద వారి వాహనాలను నిలుపుదల చేసుకొని ప్రభుత్వ డిగ్రీ కాలేజీ మైదానానికి చేరుకోవాలన్నారు.
  •  అలాగే ఆమదాలవలస, బలగ వైపు నుంచి వచ్చే వారు రిమ్స్‌ ఆస్పత్రి మీదుగా హడ్కోకాలనీ లైబ్రరీ వద్ద లేదా హడ్కోకాలనీ మున్సిపల్‌ హై స్కూల్‌ మైదానం వద్ద వాహనాలను నిలుపుదల చేసుకుని ప్రభుత్వ డిగ్రీ మైదానానికి చేరుకోవాలన్నారు.
  •  నగరంలో వివిధ మార్గాల్లో ప్రయాణించే వాహనదారులు, అరసవల్లి మిల్లు జంక్షన్, ప్రభుత్వ మహిళా కళాశాల మీదుగా, సూర్యమహల్‌ జం క్షన్, జీటీ రోడ్‌ మీదుగా ఎస్‌బీఐ వద్దకు చేరుకొని చౌకబజార్‌ మీదుగా, రౌతుబజార్‌ జంక్షన్, ఏఎస్‌ఎన్‌ కాలనీ, సురక్ష ఆస్పత్రి మీదుగా ఆర్టీసీ కాంప్లెక్స్‌కు చేరుకోవాలన్నారు.
  •  గుజరాతీపేట, హయాతినగరం, ఫాజుల్‌బాగ్‌పేట, పీఎన్‌కాలనీ వైపు వాహనదారులు కిమ్స్‌ ఆస్పత్రి జంక్షన్‌ నుంచి డేఅండ్‌ నైట్‌ జంక్షన్‌కు చేరుకోవచ్చు.
  •  నరసన్నపేట, కోటబొమ్మాళి, టెక్కలి వైపు నుంచి శ్రీకాకుళం పట్టణంలోకి రాబోయే వాహనదారులు పెద్దపాడు రోడ్డు, కొత్తరోడ్‌ జంక్షన్‌ మీదుగా ఆర్టీసీ కాంప్లెక్స్‌కు చేరుకోవాలి.
  •  ఆమదాలవలస, పాలకొండ, కొత్తూరు వైపు నుంచి కొత్తరోడ్డు మీదుగా శ్రీకాకుళం పట్టణంలోనికి యథావిధిగా ఆర్‌టీసీ కాంప్లెక్స్‌కు చేరుకోవచ్చును.

 ఏడు వేల మందికి పైగా..
పంద్రాగస్టు వేడుకల నేపథ్యంలో వేదిక వద్దకు సుమారు 5 వేల మంది విద్యార్థులు, 2 వేల మంది పబ్లిక్‌ హాజరుకానున్నట్లు ఎస్పీ తెలిపారు. వేడుకలకు హాజరయ్యే ప్రజలంతా ఈనెల 15వ తేదీన ఉదయం 8 గంటలలోపే రావాలని ఎస్పీ సూచించారు. ముందుగా ఎస్పీ రూట్‌ మ్యాప్‌ను మీడియాకు వివరించారు. ఆయనతో పాటు ట్రాఫిక్‌ డీఎస్పీ సీహెచ్‌ పెంటారావు ఉన్నారు.

800 మందికి పైగా బందోబస్తు..
పంద్రాగస్టు వేడుకల సందర్భంగా (విశాఖపట్నం)అడిషనల్‌ ఎస్పీ, 18 మంది డీఎస్పీలు, 30 మంది సీఐలు, 80 మంది ఎస్‌ఐలతో పాటు సుమారు 800 మంది వరకు నగరంలో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ వివరించారు.
 

>
మరిన్ని వార్తలు