అచ్చెన్నాయుడు అరెస్ట్‌పై చంద్రబాబు డ్రామా..

12 Jun, 2020 10:44 IST|Sakshi

ప్రజలను తప్పుతోవ పట్టించడానికి కిడ్నాప్‌ అంటూ లేఖ..

సాక్షి, విజయవాడ: మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్ట్‌పై ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కొత్త డ్రామా మొదలు పెట్టారు. ప్రజలను తప్పుతోవ పట్టించే విధంగా.. అచ్చెన్నాయుడు కిడ్నాప్‌ అంటూ లేఖ విడుదల చేశారు. ఇప్పటికే అచ్చెన్నాయుడు అరెస్ట్‌పై ఏసీబీ ప్రకటన చేయడంతో పాటు మీడియా సమావేశం కూడా నిర్వహించింది. అచ్చెన్నాయుడు ఏసీబీ అదుపులో ఉంటే పోలీసులు కిడ్నాప్ చేశారంటూ మరో డ్రామాకు తెర తీశారు. అచ్చెన్నాయుడిని శుక్రవారం ఉదయం 7.30 గంటలకు ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకోగా, అర్ధరాత్రి అరెస్ట్‌ చేశారని చంద్రబాబు పేర్కొనడం గమనార్హం. ఎక్కడకు తీసుకెళ్లారో, ఎందుకు తీసుకెళ్లారో తెలియదని బాబు గోల చేయడం శోచనీయం. (అచ్చెన్న లీలలు ఇన్నన్ని కావయా...)

చంద్రబాబు దివాళా కోరుతనానికి నిదర్శనం..
అచ్చెన్నాయుడు కిడ్నాప్‌ అంటూ చంద్రబాబు డ్రామా ఆడుతున్నారని.. ఆయనను ఇంటికెళ్లి అదుపులోకి తీసుకుంటే కిడ్నాప్‌ అని చంద్రబాబు ఎలా చెబుతారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ప్రశ్నించారు. ఈఎస్‌ఐలో జరిగిన స్కాంలో అచ్చెన్నాయుడు ప్రమేయం ఉంది కాబట్టే ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. అచ్చెన్నాయుడు కిడ్నాప్‌ అంటూ చంద్రబాబు లేఖ రాయడం ఆయన దివాళా కోరుతనానికి నిదర్శనమని మండిపడ్డారు. తమ పార్టీ నేత తప్పు కప్పిపుచ్చుకునేందుకే చంద్రబాబు కులాల ప్రస్తావన తీసుకువస్తున్నారని ధ్వజమెత్తారు. (టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అరెస్ట్‌)

మరిన్ని వార్తలు