చకచకా చంద్రయాన్‌–2 ఏర్పాట్లు

19 Jun, 2019 05:09 IST|Sakshi

ఇస్రో ప్రధాన కార్యాలయంలో రెండో లూనార్‌ సైన్స్‌ మీట్‌

సూళ్లూరుపేట: చంద్రుని మూలాలు కనుగొనడానికి ఉద్దేశించి భారత్‌ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న చంద్రయాన్‌–2 ప్రయోగానికి సంబం«ధించిన ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. షార్‌లోని వెహికల్‌ అసెంబ్లింగ్‌ బిల్డింగ్‌లో జీఎస్‌ఎల్‌వీ మార్క్‌3–ఎం1 రాకెట్‌ రెండు దశల అనుసంధానం పనులు పూర్తయ్యాయి. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) 2008 నుంచి చంద్రయాన్‌–2 ప్రయోగాన్ని పలుమార్లు వాయిదా వేసుకుంటూ వచ్చి జూలై 15న నిర్వహించేందుకు నిర్ణయించిన విషయం తెలిసిందే. ప్రయోగానికి సంబంధించి బెంగళూరు నుంచి శ్రీహరికోటకు ఆర్బిటర్‌ మిషన్‌ చేరుకున్న విషయం కూడా విదితమే. దీనికి సంబంధించి మంగళవారం బెంగళూరులోని అంతరిక్ష కేంద్ర ప్రధాన కార్యాలయంలో 60 మంది శాస్త్రవేత్తలతో రెండో లూనార్‌ సైన్స్‌ మీట్‌ నిర్వహించారు. ఈ ప్రయోగంలో అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా 8 ఆర్బిట్‌ పేలోడ్స్, మూడు ల్యాండర్‌ పేలోడ్స్, రెండు రోవర్‌ పేలోడ్స్‌ పంపించేందుకు సన్నాహాలు చేస్తున్న విషయం ఈ సమావేశంలో చర్చకు వచ్చినట్లు తెలిసింది.

అంటే ఈనెల 13, 14 తేదీల్లో కూడా చంద్రయాన్‌–2 ప్రయోగంలో ఇస్రో హెడ్‌క్వార్టర్‌లో సైన్స్‌ మీట్‌ నిర్వహించారు. రెండో మారు నిర్వహించిన లూనార్‌ సైన్స్‌మీట్‌కు వివిధ పరిశోధనా సంస్థలు, విశ్వ విద్యాలయాలు, కళాశాలలు, ఇస్రో కేంద్రాలు, ప్రయోగశాలలనుంచి సుమారు 60 మంది శాస్త్రవ్తేతలు హాజరయ్యారు. చంద్రయాన్‌–2లో పంపబోయే నాలుగు పేలోడ్స్‌ గురించి కూడా వారు చర్చించినట్టు సమాచారం. ఇందులో ఇన్‌ఫ్రారెడ్‌ స్పెక్ట్రోమీటర్, సింథటిక్‌ ఆపార్చర్‌ రాడార్, ఎక్స్‌రే స్పెక్ట్రో మీటర్, మాస్‌ స్పెక్ట్రోమీటర్‌ వంటి ఆర్బిటర్‌ పేలోడ్ల యొక్క డేటా విశ్లేషణ పద్ధతి, పేలోడ్‌ డేటాను సైన్స్‌ ఉత్పత్తులకు మార్చడంలో వున్న దశల గురించి వారంతా సమావేశంలో విశ్లేషించారని తెలుస్తోంది. ఈ సమావేశంలో ఇస్రో మాజీ చైర్మన్‌ ఏఎస్‌ కిరణ్‌కుమార్‌తో పాటు 60 మంది శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

జగన్ సీఎం అయ్యాడని శ్రీశైలానికి పాదయాత్ర

విలాసాలకు కేరాఫ్‌ ప్రభుత్వ కార్యాలయాలు

నారికేళం...గం‘ధర’ గోళం

మార్పునకు కట్టుబడి..

మోడీ పథకాలకు చంద్రబాబు పేరు పెట్టుకున్నారు

బంకుల్లో నిలువు దోపిడీ.!

కొత్త గవర్నర్‌కు సీఎం జగన్‌ శుభాకాంక్షలు

కుమార్తె వద్దకు వెళ్లి తిరిగి వస్తూ..

ముస్లిం మైనార్టీలకు ఏకైక శత్రువు కాంగ్రెస్సే

అరెస్ట్‌ చేశారు.. చార్జిషీట్‌ మరిచారు

నగదు వసూలు చేస్తే జైలుకే

ఎంపికైతే ఏం చేస్తారు?

గ్యాస్‌ అయిపోయిందని భోజనం వండని సిబ్బంది

రాజాంలో దొంగల హల్‌చల్‌

దెయ్యం.. ఒట్టి బూటకం 

నన్ను ప్రేమించలేదు..అందుకే చంపేశాను

బీహార్‌ దొంగల బీభత్సం

బది'లీలలు' ఏమిటో..?

జాగ్రత్త తీసుకుని ఉంటే బతికేవాడే

సిరా ఆరకముందే 80% హామీల అమలు

అక్రమ నిర్మాణాలను ఉపేక్షించేది లేదు

బెజవాడలో టీడీపీ నేతల సిగపట్లు

‘సదావర్తి’పై విజిలెన్స్‌ విచారణ

సామాన్య భక్తులకు త్వరితగతిన శ్రీవారి దర్శనం

‘ప్రత్యేక హోదా’ను ఆర్థిక సంఘానికి నివేదించాం

లంచాలు లేకుండా పనులు జరగాలి

‘కాపు’ కాస్తాం

ఏపీ కొత్త గవర్నర్‌గా విశ్వభూషణ్‌ హరిచందన్‌

ఉద్యోగాల పేరుతో మోసపోయిన విద్యార్థినిలు

ఈనాటి ముఖ్యాంశాలు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

చదరంగం 

మరో రెండు!

థ్రిల్‌ చేసే ‘ఎవరు’

గొప్పమనసు చాటుకున్న లారెన్స్‌

సూర్య వ్యాఖ్యలపై దుమారం

నటి జ్యోతికపై ఫిర్యాదు