రైళ్ల వేళల్లో మార్పులు

31 Aug, 2014 02:59 IST|Sakshi
రైళ్ల వేళల్లో మార్పులు

విశాఖపట్నం : రైళ్ల రాకపోకల వేళలు సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి మారబోతున్నాయి. ఇప్పటికే దురంతో ఎక్స్‌ప్రెస్‌తో బాటు పలు రైళ్ల రాకపోకలు మారిన సంగతి తెలిసిందే. తాజాగా మరిన్ని రైళ్ల వేళలు మారినట్టు తూర్పుకోస్తా రైల్వే ప్రకటించింది.  
 
హౌరా/ హైదరాబాద్(ఈస్టుకోస్టు) ఎక్స్‌ప్రెస్ తెల్లవారుజామున 3.55 గంటలకు చేరుకుని 4.15 గంటలకు బయల్దేరుతుంది.
 
 మచిలీపట్నం/నరసాపురం నుంచి విశాఖకు వచ్చే ప్యాసింజర్ ఉదయం 8 గంటలకు చేరుతుంది.
 
 సాంత్రగచ్చి నుంచి ఛెన్నై సెంట్రల్ల్ బై వీక్లీ ఎక్స్‌ప్రెస్  బుధ, శనివారాల్లో ఉదయం 8.10గంటలకు వచ్చి 8.30 గంటలకు బయలుదేరుతుంది.
 
 విజయవాడ-రాయగడ పాసింజర్ ఉదయం 8.20 గంటలకు వచ్చి 8.40 గంటలకు బయలుదేరుతుంది.
 
హటియా-యశ్వంత్‌పూర్ బై వీక్లీ ఎక్స్‌ప్రెస్  సోమ, బుధవారాల్లో, అసన్‌సోల్-చెన్నై ఎక్స్‌ప్రెస్ గురువారం, టాటానగర్-యశ్వంత్‌పూర్ వీక్లీఎక్స్ ప్రెస్ శనివారం, హటియా-యశ్వంత్‌పూర్ వీక్లీఎక్స్‌ప్రెస్ ఆదివారం నడిచే రైళ్లు ఉదయం 9.40 గంటలకు వచ్చి 10 గంటలకు బయలుదేరుతాయి.
 
 దన్‌బాద్/టాటానగర్ - అలెప్పిబొకారో ఎక్స్‌ప్రెస్ ఉదయం 9.55 గంటలకు చేరుకొని 10.15 గంటలకు బయలుదేరుతుంది.
 
 నాందేడ్ / సంబల్‌పూర్ ట్రైవీక్లీ ఎక్స్‌ప్రెస్ మంగ,బుధ,ఆదివారాల్లో 10.15 గంటలకు చేరుకొని 10.35 గంటలకు వెళుతుంది.
 
 సంబల్‌పూర్/నాందేడ్ ట్రైవీక్లీ ఎక్స్‌ప్రెస్ సోమ,శుక్ర,ఆదివారాల్లో విశాఖకు రాత్రి 7.05 గంటలకు చేరుకొని 7.25 గంటలకు బయలుదేరుతుంది.
 
 విశాఖ-మచిలీపట్నం/నర్సాపూర్ పాసింజర్ రాత్రి 7.45 గంటలకు బయలుదేరుతుంది.
 
 మూడు కొత్త రైళ్లకు చోటు....

విశాఖ, విజయనగరం  మీదుగా మరో మూడు కొత్త రైళ్లు పరుగులు తీయనున్నాయి.  కొత్త రైళ్ల వేళలను కొత్త రైల్వే టైంటేబుల్లో పొందుపరిచింది. హౌరా- యశ్వంత్‌పూర్-హౌరా (22863/64), గాంధీధమ్-పూరి-గాంధీధమ్ (19453/54) రైళ్లు విజయనగరం మీదుగా ప్రయాణిస్తున్నాయి. విశాఖ మీదుగా టాటానగర్-బయ్యపానహలి(బెంగుళూర్)-టాటానగర్ (18111/12) ఎక్స్‌ప్రెస్ నడుస్తుంది.
 
 టాటా నగర్-బయ్యపానహలి(బెంగుళూర్) ఎక్స్‌ప్రెస్ ప్రతీగురువారం టాటానగర్‌లో సాయంత్రం 6.35 గంటలకు బయలుదేరి శుక్రవారంఉదయం 9.40 గంటలకు విశాఖ చేరుకొని, తిరిగి 10 గంటలకు బయలుదేరి  రాత్రి 7 గంటలకు చేరుకుంటుంది.
 
 బయ్యపానహలి (బెంగుళూర్)-టాటానగర్ ఎక్స్‌ప్రెస్ ప్రతీ ఆదివారం ఉదయం 9.15 గంటలకు బయలుదేరి అదే రోజు రాత్రి 7.55 గంటలకు విశాఖ చేరుకొని తిరిగి 8.15 గంటలకుబయలుదేరి సోమవారం మధ్యాహ్నం 12.35 గంటలకు టాటా చేరుతుంది.
 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు