మోసపోయాం... ఆదుకోండి

19 Jun, 2014 20:26 IST|Sakshi
మోసపోయాం... ఆదుకోండి

గుంటూరు: గుంటూరుకు చెందిన ఇద్దరు మిర్చి వ్యాపారులు తమను మోసం చేశారంటూ చైనాకు చెందిన గుడాన్ అనే మహిళ బుధవారం అరండల్‌పేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చైనా, వియత్నాం దేశాల్లో ఓ సంస్థ ద్వారా గుడాన్ మిర్చి వ్యాపారం చేస్తున్నారు. రెండు నెలల కిందట గుంటూరుకు చెందిన బాబు ఎంటర్‌ప్రైజెస్‌కు చెందిన మధుబాబు, సుబ్బారావులు ఆన్‌లైన్‌లో గుడాన్‌తో వ్యాపార ఒప్పందం  కుదుర్చుకున్నారు.

సుమారు రూ.46 లక్షల విలువజేసే మిర్చిని చైనా, వియత్నాంకు ఎగుమతి చేస్తామని వారు ఆ ఒప్పందంలో పేర్కొన్నారు. దీంతో ఆమె డబ్బును ఆన్‌లైన్‌లోనే చెల్లించారు. తీరా రెండు నెలలు గడిచినా మిర్చిని పంపకపోవడంతో ఈనెల 14న అరండల్‌పేట పరిధిలోని సాలిపేటలో ఉన్న ఆఫీసులో మధుబాబు, సుబ్బారావులను గుడాన్ సంప్రదించారు. దీంతో మధుబాబు, సుబ్బారావులు ఆమెను బెదిరించారు.

దీంతో జిల్లా అర్బన్ ఎస్పీ గోపీనాథ్‌జెట్టిని గుడాన్ బుధవారం ఆశ్రయించారు. ఆయన ఆదేశాల మేరకు అరండల్‌పేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, ఈ కేసును సీసీఎస్ పోలీసులకు బదిలీ చేశారు. గుడాన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని ఎస్పీ తెలిపారు. ఇదిలా ఉండగా గతంలో కూడా చైనాకు చెందిన మరో వ్యక్తిని మధుబాబు, సుబ్బారావులు మోసం చేసినట్లు సమాచారం.

మరిన్ని వార్తలు