మాధవి కేసులో భాను అరెస్ట్

10 Feb, 2016 11:42 IST|Sakshi

నెల్లూరు: అసిస్టెంట్ ప్రొఫెసర్ వీర మాధవి (28) ఆత్మహత్య కేసులో ప్రియుడు భానుతేజను పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. ప్రేమించిన వ్యక్తి ముఖం చాటేయడంతో తట్టుకోలేక సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మహత్యకు కారణాలను వివరించి మాధవి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.

'భానూ..ఒకే ఒక కోరిక ఉంది తీరుస్తావా..నా చేతులకు గాజులు వేసి..నా ముఖాన ఇంత  బొట్టుపెట్టు..మనకి భగవంతుని దృష్టిలో ఎప్పుడో పెళ్లయిపోయింది భానూ.. ఈ ఒకే ఒక్క కోరిక తీరుస్తావని మరీ మరీ కోరుకుంటున్నాను. ఇంకెప్పుడు నీ లైఫ్‌లోకి..ఇంకెవరి లైఫ్‌లోకి రాను.. మీకందరికీ దూరంగా వెళ్లిపోవాలని..ముఖ్యంగా ఈ నరకాన్ని భరించలేక వెళ్లిపోతున్నాను.. ఇక సెలవ్..'అంటూ వీడియో సెల్ఫీ తీసుకున్న మాధవి బలవన్మరణానికి పాల్పడ్డారు. కావలిలోని కో-ఆపరేటివ్ కాలనీకి చెందిన మాధవి పట్టణంలోని ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలో మ్యాథ్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేసేవారు. మాధవి ఆత్మహత్యకు కారణమైన భానుతేజను పోలీసులు అరెస్ట్ చేసి ప్రశ్నిస్తున్నారు.

మరిన్ని వార్తలు