పలమనేరు, నరహరిపేట చెక్‌పోస్టుల్లో ఏసీబీ దాడులు

28 Jul, 2014 03:18 IST|Sakshi
 •     రూ.1.12 లక్షలు స్వాధీనం
 •      ఏజెంట్‌ను అదుపులోకి తీసుకున్న
 •      అధికారులు
 • పలమనేరు/గుడిపాల: పలమనేరు, గుడిపాల సమీపంలో టని ఆర్టీవో, ఏసీటీవో చెక్‌పోస్టులపై ఏసీబీ అధికారులు ఆదివారం తెల్లవారుజామున ఆకస్మిక దాడులు నిర్వహించారు. లెక్కకు మించి డబ్బులున్నట్టు గుర్తిం చారు. ఓ ప్రైవేటు ఏజెంట్‌ను అదుపులోకి తీసుకున్నా రు. నాలుగు నెలల క్రితం పలమనేరు చెక్‌పోస్టులో ఏసీ బీ అధికారులు దాడులు జరిపి రూ.లక్ష వరకు లెక్కకు మించిన డబ్బును సీజ్ చేయడంతో పాటు కొందరు ఏజెంట్లను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.

  పక్కా సమాచారంతో ఆదివారం తెల్లవారుజామున ఒంటిగంట ప్రాంతంలో పలమనేరులోని ఏసీటీవో, పక్కనే ఉన్న ఆర్‌టీవో చెక్‌పోస్టులలో రెండు బృందాలుగా సోదాలు నిర్వహించారు. అక్కడున్న రికార్డులను పూర్తిగా పరిశీలించారు. ఈ రెండు చెక్‌పోస్టులలోనూ లెక్కకు మించి రూ.70 వేలు అధికంగా ఉన్నట్టు గుర్తిం చారు. దీనిపై సంబంధిత చెక్‌పోస్టు అధికారులు ఏసీటీవో గుర్రప్ప, ఆర్‌టీవో సుధాకర్ రెడ్డి సమాధానం ఇవ్వలేదు. లారీ డ్రైవర్లు, వాహన యజమానుల నుం చి అధిక మొత్తంలో వసూలు చేయడంతోనే అదనంగా నగదు ఉన్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. ప్రైవే ట్ ఏజెంట్ మల్లికార్జునను అదుపులోకి తీసుకున్నారు.

  రికార్డుల పరిశీలన పూర్తిస్థాయిలో జరిగాక బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని తిరుపతి ఏసీబీ డీఎస్పీ శంకర్‌రెడ్డి తెలిపారు. ఈ దాడుల్లో ఏసీబీ సీఐలు పార్థసారథిరెడ్డి, చంద్రశేఖర్, ప్రసాద్‌రావ్ తదితరులు ఉన్నారు. అదేవిధంగా గుడిపాలలోని చెన్నై-బెంగళూరు జాతీయ రహదారిలో ఉన్న చెక్‌పోస్టుపై ఏసీబీ డీఎస్పీ విజయపాల్, సీఐలు రామ్‌కిషోర్, సుధాకర్‌రెడ్డి, కృష్ణారెడ్డి, లక్ష్మీకాంత్‌రెడ్డి, శ్రీకాంత్ ఆదివారం తెల్లవారుజామున దాడులు చేశారు. ఈ సందర్భంగా రూ.42 వేలు స్వాధీనం చేసుకున్నారు.

  ఈ చెక్‌పోస్టులో రవాణా, కమర్షియల్, సివిల్ సప్లరుు, ఫారెస్ట్, ఎక్సైజ్, మార్కెట్ శాఖలు ఉన్నాయి. కమర్షియల్ ట్యాక్స్ కార్యాలయం లో ఉన్న ఏసీటీవో గెస్ట్‌హౌస్‌లో అనధికారికంగా ఉన్న రూ.19,190లను అధికారులు పట్టుకున్నారు. అలాగే వాహనదారులు కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసులో రూ. 8,580 మామూళ్లు ఇచ్చారు. ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసులో ఏసీబీ అధికారులు కూర్చొగా రూ.14,110 వచ్చింది. మొత్తం రూ.42 వేలు వచ్చినట్టు అధికారులు పేర్కొన్నారు.
   
  అవినీతిపై సమాచారం ఇవ్వండి
   
  ప్రభుత్వ కార్యాలయాల్లో ఎటువంటి అవినీతి కార్యకలాపాలు జరుగుతున్నా తమకు సమాచారం ఇవ్వాలని ఏసీబీ డీఎస్పీ శంకర్‌రెడ్డి తెలిపారు. సమాచారం ఇచ్చేవారు 9440446190, 9440446120, 9440446191, 9440446138 నెంబర్లకు ఫోన్ చేయాలని ఆయన సూచించారు.
   

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు