బినామీలకు చెక్

10 Jan, 2014 23:35 IST|Sakshi

పాపన్నపేట, న్యూస్‌లైన్:  తెలంగాణలో ప్రసిద్ధి చెందిన ఏడుపాయల దుర్గా భవానీ ఆలయం వద్ద ఈనెల 30న మాఘ అమావాస్య, ఫిబ్రవరి 27న మహాశివరాత్రి సందర్భంగా భారీ ఉత్సవాలు జరుగుతాయి. ఈ మేర కు జాతరలో వివిధ వ్యాపారాలు చేసుకునేందుకు శుక్రవారం ఏడుపాయలలో వేలం పాటలు నిర్వహించారు. మొత్తం 8 అంశాలకు వేలం పాటలు నిర్వహిం చగా, ఒడిబియ్యం రూ.6.66 లక్షలకు, ఘనపురం వైపు సైకిల్ స్టాండ్ రూ.80 వేలు, జాతర అనంతరం ఏడుపాయల్లో కొబ్బరికాయలు విక్రయించేందుకు రూ.25.26 లక్షలకు వేలం పాటలు ఖరారయ్యాయి.

కాగా మిగతా వాటికి ఆశిం చిన స్థాయిలో ఆదాయం రాక పోవడం తో చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి వేలం పాటలను ఈనెల 16వ తేదీకి వాయిదా వేశారు. జాతరలో కొబ్బరికాయలు అమ్మేందుకు గత ఏడాది రూ.14.10లక్షలు, తలనీలాలకు రూ.7.52లక్షలు, జాతరలో లడ్డు, పులిహోరా విక్రయించుకునేందుకు రూ.14.16 లక్షలు, నూనే గురుగులు విక్రయించేందుకు రూ.2.36లక్షలు, వాహనాల తైబజార్‌కు రూ.2.65 లక్షలు ఖరారయ్యాయి. కాగా ఈ ఏడాది కాం ట్రాక్టర్లు అంతకంటే తక్కువగా వేలం పాటలు పాడటంతో వాటిని వాయిదా వేశారు.

 కాంట్రాక్టర్ల కాసులాటలు
 గతంలో కాంట్రాక్టర్లు జాతర వేలం పాటల్లో నిబంధనలకు విరుధ్ధంగా పాల్గొంటూ లక్షల రూపాయలు పాటలు పాడి అపై దేవాదాయ శాఖకు భారీ మొత్తంలో బకాయి పడి ఎగ్గొట్టిన సంఘటనలున్నాయి. లక్షల రూపాయల బకాయిలు ఉన్నప్పటికీ తిరిగి కొత్త వ్యక్తుల పేర్లతో కాంట్రాక్ట్ పొందుతున్నారు. ఈసారి చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, ఈఓ వెంకటకిషన్‌రావులు కఠిన నిబంధనలు అమలు చేశారు. టెండర్‌లో పాల్గొనే కాంట్రాక్టర్లు బ్యాంకు పాస్‌బుక్, చెక్కుబుక్, ధరావత్, జమానత్‌లను సమర్పిస్తేనే వేలం పాటల్లో పాల్గొనే అవకాశం కల్పించారు.

 దీంతో అక్రమార్కుల ఆట లు సాగలేదు. గత సంత్సవరం స్థాయి లో వివిధ అంశాలకు సంబంధించి వేల విలువలు రాక పోవడంతో 5 అంశాలను ఈనెల 15వ తేదీకి వాయిదా వేశారు. జాతర అనంతరం  విక్రయించే లడ్డు, పులిహోర ప్రసాదాలు సైతం నిబంధనలకనుగుణంగా  కాంట్రాక్టర్ల నుండి తప్పించారు. కాగా జాతర సమయానికి మాత్రం ప్రసాదాన్ని కాంట్రాక్టర్లకు అప్పగించేందుకు దేవాదాయ అనుమతి కోసం ప్రతి పాదనలు పంపినట్లు చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమం లో అసిస్టెంట్ కమిషనర్ కృష్ణ ప్రసాద్, ధర్మకర్తలు లలిత, పోచయ్య, దేవయ్య, సంజీవయ్య, పెంటయ్య, నర్సింలు, యాదయ్య, సంగమేశ్వర్, నర్సింహచారి, మాజీ జెడ్పీటీసీ మల్లప్ప, ఉద్యోగులు గోపాల్, రవికుమార్, మధుసూదన్‌రెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు