గరటయ్యది ప్రజాసేవ.. గొట్టిపాటిది డబ్బుయావ

10 Apr, 2019 14:08 IST|Sakshi
చెంచు గరటయ్య, గొట్టిపాటి రవికుమార్‌

సాక్షి, అద్దంకి (ప్రకాశం): నియోజకవర్గంలో ప్రధాన పార్టీలైన వైఎస్సార్‌ సీపీ, టీడీపీ మధ్యే ప్రధాన పోటీ నెలకొంది.  వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్‌ బాచిన చెంచు గరటయ్య, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్‌ పోటీలో తలపడతున్నారు. ప్రజా ప్రతినిధులుగా ఓటర్ల తీర్పును కోరబోతున్న నేపథ్యంలో ఇద్దరి వ్యక్తిగతంతో పాటు రాజకీయ జీవితంపై  విశ్లేషకులు, ప్రజలు తెలిపిన అభిప్రాయాలు.

గరటయ్య అందరి బంధువయ్యా..
♦ వైద్యునిగా జీవితాన్ని ప్రారంభించారు.
 ఎంతో మందికి ఉచిత సేవలందించి ప్రాణదాతగా నిలిచారు.
♦ నాలుగు సార్లు ప్రజాప్రతినిధిగా పనిచేసిన అనుభవం.
♦ మృధు స్వభావి, ఆపదలో ఉన్నవారిని ఆదుకునే మనస్తత్వం.
♦ ముక్కు సూటి మనిషి, నిగర్వి, రాజకీయ దురంధరుడు.
♦ పల్లెలో ప్రతి ఒక్కరిని పేరుపెట్టి పిలిచేంత చనువు ఉంది. 
♦ వర్గ రాజకీయాలను ఏ మాత్రం ప్రోత్సహించడనే మంచి పేరుంది.
♦ ప్రత్యర్థి వర్గం వారైనా సాయం కోరితే ఆదుకుంటాడు.
♦ పేదల, రైతుల పక్షపాతి వారి అభివృద్ధి కోసం అహర్నిశలు కృషిచేశారు.
♦ ఆయన ఎమ్మెల్యేగా పని చేసిన కాలంలో పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు ఇప్పించారు.
♦ గరటయ్య కాలనీ ఏర్పాటు చేసి పేదల మనస్సులో చిరస్థాయిగా నిలిచారు.
♦ నియోజకవర్గ అభివృద్ధి కోసం అనునిత్యం తపించే తత్వం గరటయ్య సొంతం
♦ అవినీతి రహితుడిగా నియోజకవర్గ ప్రజల్లో మంచి పేరు సంపాదించుకున్నారు.
♦ ముక్కు సూటిగా శత్రువుపై పోరాడే మనస్తత్వం ఉన్న నాయకునిగా అందరూ కొనియాడుతుంటారు.

గొట్టిపాటి అవినీతిలో ఘనాపాఠి..
వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పెట్టిన భిక్షతో రాజకీయాల్లో ప్రవేశించి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
♦ మొదటి నుంచి వ్యాపారమే పరమావధిగా భావించే వ్యక్తి. 
అభివృద్ధి పనులు చేశారని పేరున్నప్పటికీ తనసొంత ప్రయోజనం లేకుండా ఎటువంటి అభివృద్ధి పనుల చేయరు.
పైకి మృధు స్వభావిగా కనిపించినా ప్రత్యర్థులపై దయాదాక్షిణ్యాలు చూపించరు.
ధన బలంతో ఏదైనా సాధించవచ్చనే స్వభావం కలిగిన వ్యక్తి
గెలుపు కోసం అధికారులను, ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తారు. 
పేదల భూములను గ్రానైట్‌ కోసం లాక్కున్నాడనే ఆరోపణలు.
తన వ్యాపారం కోసమే పార్టీ మారాడనే విమర్శలు ప్రజల నుంచి వినవస్తున్నాయి.
కరణం బలరాంతో దశాబ్దాల పాటు ఫ్యాక్షన్‌ గొడవలు.
ప్రజలు, రైతు సమస్యలపై అవగాహన తక్కువ.
సాగు నీటి విషయంలో రైతులకు ఏ మాత్రం మేలు జరగలేదు.
వర్గ రాజకీయాలకు కేంద్ర బిందువుగా నిలిచి, టీడీపీలో ఉన్న మరో సీనియర్‌ నాయకునితో ఉన్న వర్గ విభేధాలు 
ఇరు వర్గీయులు మధ్య చోటు చేసుకున్న గొడవల్లో కార్యకర్తల ప్రాణాలు బలితీసుకున్నారు.

మరిన్ని వార్తలు