ఆ వరాలన్నీ.. ఉత్త ఊరింపులేనా?

15 May, 2015 02:19 IST|Sakshi

ముఖ్యమంత్రి చంద్రబాబు రెండు వారాల్లో రెండోసారి శుక్రవారం జిల్లా పర్యటనకు వస్తున్నారు. వచ్చిన ప్రతిసారీ కొన్ని హామీలిస్తున్న ఆయన వాటిని అమలు చేయడంపై దృష్టి పెట్టడం లేదనే విమర్శను ఎదుర్కొంటున్నారు. అధికారంలోకి వచ్చాక బాబు పలు సందర్భాల్లో జిల్లాకు ప్రకటించిన తాయిలాలు నోటి మాటలుగానే మిగులుతున్నాయి. జిల్లావాసుల్లో ఆశలు రేకెత్తిస్తున్న బాబు వరాలు ఆచరణకు నోచుకోవడం లేదు. కేంద్రంలో తమ భాగస్వామ్యపక్షమే అధికారంలో ఉందని చెప్పుకోవడానికే తప్ప సమన్వయంతో జిల్లాకు ప్రయోజనం కల్పించే ప్రాజెక్టులు తీసుకురాలేకపోతున్నారని జిల్లావాసులు విమర్శిస్తున్నారు.
 
 సాక్షి ప్రతినిధి, కాకినాడ :చంద్రబాబు సీఎం అయ్యాక జిల్లాకు ఇచ్చిన వరాల్లో కాకినాడలో హార్డ్‌వేర్ పార్కు, తొండంగిలో జీఎంఆర్ పోర్టు ఏర్పాటు, కాకినాడలో యాంకరేజ్ పోర్టు అభివృద్ధి, కాకినాడలో ట్రిపుల్ ఐటీ, కాకినాడ ఎస్‌ఈజడ్, పెట్రో కారిడార్, పెట్రో యూనివర్సిటీ, కాకినాడ-రాజమండ్రి మధ్య ఇండస్ట్రియల్ కారిడార్, కోనసీమలో కొబ్బరి ప్రాంతీయ కార్యాలయం, కడియంలో నర్సరీ రీసెర్చ్ సెంటర్, రాజమండ్రి సమీపాన ఫుడ్‌ప్రాసెసింగ్  యూనిట్ కొన్ని. ఇలా చెప్పుకుంటూ పోతే బాబు వరాల జాబితా చాంతాడంత ఉంటుంది. అధికారంలోకొచ్చి ఏడాది కావస్తున్నా వీటిలో ఏ ఒక్కదాన్నీ ఇంతవరకు సాకారం చేయలేకపోయారు. ఈ ప్రాజెక్టుల ద్వారా వేలాది మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని చంద్రబాబు యువతకు ఆశలు కల్పించారు. అరుుతే ఇంతవరకూ జిల్లాలో ఒక్క నిరుద్యోగికైనా ఉద్యోగం లేదా ఉపాధి కల్పించలేకపోయారంటున్నారు. శుక్రవారం జిల్లాకు పర్యటనకు వస్తున్న చంద్రబాబు ఇంతవరకు తాను ప్రకటించిన తాయిలాల రుచి చూపేలా చిత్తశుద్ధితో కూడిన కృషి సలపాలని జిల్లావాసులు కోరుతున్నారు. ఆ దిశగా కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి సాంకేతికంగా అనుమతులు సాధించాలని యువత కోరుకుంటోంది.
 
 పుష్కర పనుల్ని వేగవంతం చేయూలి..
 గోదావరి పుష్కరాలను దేశంలోనే ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తామని చంద్రబాబు చెబుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో పుష్కరాల పనుల ప్రగతి చూస్తే అందుకు పూర్తి భిన్నంగా ఉంది. పుష్కరాలకు 60 రోజులు మాత్రమే మిగిలి ఉండగా ఆర్‌అండ్‌బి, నీటిపారుదల శాఖల ఆధ్వర్యంలో పనులు మందకొడిగా నడుస్తున్నాయి. చివరకు రాజమండ్రి కార్పొరేషన్ పరిధిలో జరుగుతున్న పనులు కూడా ఆ బాపతుగానే ఉన్నాయి. పర్యవేక్షణకు కమిటీలపై కమిటీలు వేసినా పనులు మాత్రం ముందుకు కదలని వాస్తవంపై సీఎం ప్రత్యేక దృష్టి పెట్టి, వాటిని వేగవంతం చేయూల్సి ఉంది.
 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా