మరో గర్భశోకం

25 Oct, 2017 13:09 IST|Sakshi

ఏజెన్సీలో ఆగని శిశు మరణాలు

రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో మరో పురిటి బిడ్డ మృతి

పురిటి నొప్పులతో వెళ్తే సరి.. రిఫర్‌ టు రాజమహేంద్రవరం

వరుస చావులు సంభవిస్తున్నా కరగని మనసులు

రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో గర్భిణులు జాయినైతే చాలు ‘క్రిటికల్‌’ అని ముద్ర వేసి రాజమహేంద్రవరంలోని  వైద్య విధాన పరిషత్తు జిల్లా ఆసుపత్రికి తరలించేస్తున్నారు. క్రిటికల్‌ అనే కేసులను 108 సిబ్బంది మార్గం మధ్యలో డెలివరీలు చేసేస్తున్నారంటే వైద్యుల్లో ఏమేరకు నిర్లక్ష్యం ఆవహించి ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆ వివరాలు ఇలా...

తూర్పుగోదావరి ,రంపచోడవరం: అమ్మ గర్భగుడి నుంచి బయట ప్రపంచంలోకి వచ్చి కళ్లు తెరవకుండానే పసి కందులకు నిండూ నూరేళ్లు నిండిపోతున్నాయి. ఆసుపత్రుల్లో ప్రసవా లు సురక్షితమని ఓ వైపు చెబుతున్నా ఆ ఆ సుపత్రుల్లో గర్భిణులకు వైద్య సేవలు అం దడం లేదు. ఏజెన్సీలో ఎంత మంది పసికందుల ప్రాణాలు పోతే ఇక్కడ వైద్య సేవలు మెరుగుపడతాయని పురిటిలోనే పిల్లలను కోల్పోయిన తల్లులు శాపనార్థాలు పెడుతున్నారు. ఎంతమంది పసికందుల కళ్లు మూస్తే అధి కారులు కళ్లు తెరుస్తారోనని కన్నీళ్ల పర్యంతమవుతున్నారు. రం పచోడవరం ఏరియాఆసుపత్రిలో మారేడుమిల్లిమండలం చావి డికోటగ్రామానికి చెందిన బత్తుల ప్రేమలత అనే గర్భిణి కాన్పు లోనే పసికందును కోల్పోయి గర్భశోకాన్ని అనుభవిస్తోంది.

పురిటి నొప్పులతో బాధ పడుతున్నా పట్టించుకోని వైనం...
చావిడికోట గ్రామం నుంచి ప్రేమలత సోమవారం మధ్యాహ్నం రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి ఇన్‌ పేషెంట్‌గా చేరింది. ఆ సమయంలో వైద్యులు పరీక్ష చేసి బాగానే ఉందని ఆసుపత్రిలోనే ఉంచారు. అదే రోజు రాత్రి పురిటి నొప్పులతో బాధ పడుతుండడంతో బాధితురాలి అత్త అక్కడే ఉన్న నర్సులకు చెప్పినా చిరాకు పడ్డారే తప్ప ప్రాథమిక వైద్యం కూడా అందించలేదు. ప్రధాన వైద్యులెవరూ అందుబాటులో లేకపోవడంతో బాధతో నరకయాతన అనుభవించింది. అప్పటికే బిడ్డ సగం బయటకు వచ్చి ఆగిపోయింది. ఈ విషయం మళ్లీ వచ్చి ప్రాధేయపడడంతో నర్సులు వచ్చి చూసేసరికే ప్రాణం పోయింది.

గర్భిణులకు వైద్యం అందే పరిస్ధితి లేదా...
రంపచోడవరంఏరియా ఆసుపత్రిలో గర్భిణులకు కనీస వైద్యం అందించి భరోసానివ్వడంలో ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది వి ఫలమవుతున్నారని ఇటీవల జరిగిన ఘటనలే రుజువు చేస్తున్నాయి. వచ్చిన కేసులు క్రిటికల్‌గా ఉన్నాయని రాజమహేంద్రవరం పెద్దాసుపత్రికి రిఫర్‌ చేస్తున్నారు. విషమంగా ఉన్నయన్న కేసులు మార్గమ«ధ్యలో 108 సిబ్బంది సుఖ ప్రసవం చేయడం విశేషం. రంపచోడవరం ఏరియా ఆసుపత్రి నుంచి కేసుల రిఫర ల్‌ పరిశీలిస్తే ఏప్రిల్‌ నెలలో 27 మంది గర్భిణులను రిఫర్‌ చేయగా మేలో 28 మంది, జూన్‌లో 26 మంది, జూలైలో 55 మంది, ఆగస్టులో 55, సెప్టెంబర్‌లో 21 మంది గర్భిణి కేసులను రాజ మహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్‌ చేశారు. ఏరియా ఆసుపత్రిలో ఒక గైనిక్‌ వైద్యుడిని డిప్యూటేషన్‌పై నియమించా రు. సెలవు పెట్టినప్పుడు, రాత్రి సమయాల్లో ప్రాణంమాదకు వస్తోంది. సోమవారం మృతశిశువు జనన ఘటనపై ఆసుపత్రి ఇన్‌చార్జి కార్తీక్‌ను వివరణ కోరగా పురిటి నొప్పుల విషయం డ్యూటీలో ఉన్న సిబ్బంది తనకు చెప్పలేదని తెలిపారు.

మరిన్ని వార్తలు